టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘జాక్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొంచెం క్రాక్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.ఈరోజు థియేటర్లలో విడుదల అయ్యింది. రొమాంటిక్, కామెడీ, యాక్షన్ కలిపి ఈ చిత్రం తెరకెక్కించారని తెలుస్తోంది.ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో హిట్ ట్రాక్‌లో ఉన్న సిద్దు, ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తన ఎస్‌వీసీసీ బ్యానర్‌పై నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది.టెర్రరిస్ట్ కాన్సెప్ట్‌ను ఈ కథలోకి ఎలా జొప్పించారు? ఆ ట్రాక్‌తో ఉన్న లింక్ ఏంటన్నది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఇక వైష్ణవి చైతన్య పాత్రకి చాలా ప్రాధాన్యత ఉందన్నట్టుగా కనిపిస్తోంది.నరేష్ కామెడీ, సిద్దు టైమింగ్, శ్యామ్ సీఎస్ ఆర్ఆర్, అచ్చు రాజమణి పాటలు సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఇక చాలా రోజుల తరువాత ప్రకాష్ రాజ్‌కు మంచి పాత్ర దక్కినట్టుగా అనిపిస్తుంది. మరి ఈ జాక్ చిత్రం అయితే న్యూ ఏజ్ కంటెంట్, మేకింగ్‌లానే కనిపిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సారి ఎక్కువగా హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను నమ్ముకున్నాడని తెలుస్తోంది.
యూత్ టార్గెట్
బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తీసుకుని ఈ జాక్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ చాలా టైం తీసుకున్నాడు. ఇక మళ్లీ జాక్ సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్ ఖాతాలో హిట్ పడుతుందా? ఫ్లాప్ పడుతుందా? అన్నది చూడాలి.అసలే సిద్దు మంచి ఫాంలో ఉన్నాడు. టిల్లు, టిల్లు స్క్వేర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో మంచి బజ్ అయితే ఉందన్న సంగతి తెలిసిందే.కంటెంట్ పరంగా జాక్ లో వైవిధ్యం కనిపిస్తోంది.సిద్దు మార్కు కామెడీ టైమింగ్ ని వాడుకుంటూనే యాక్షన్, ఫన్ రెండింటిని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బ్యాలన్స్ చేసిన తీరు ఆసక్తి గొలిపేలా ఉంది. ట్రైలర్ చివర్లో రొమాన్స్ గురించి సిద్దు చెప్పే డైలాగులు, నాన్నగా నటించిన నరేష్ తో పండించిన హాస్యం యూత్ ని టార్గెట్ చేసుకున్నాయి. సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా అచ్చురాజమణి పాటలు ఆల్రెడీ జనాల్లోకి వెళ్లిపోయాయి. కొంచెం క్రాక్ క్యాప్షన్ పెట్టుకుని వస్తున్న జాక్ అంచనాలు రేపడంలో సక్సెసయ్యాడు.

నెటిజన్ ట్వీట్
ఉదయం నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. ఫ్యామిలీ, లవ్ స్టోరీ సినిమాల దర్శకుడిగా ముద్రపడిన బొమ్మరిల్లు భాస్కర్ ఈసారి తన జానర్ మార్చి జాక్ మూవీని తెరకెక్కించాడు.రి ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన జాక్‌పై నెటిజన్లు ఏమంటున్నారో ఓ లుక్కేస్తే,జాక్ కథను అలా సగం వండి వదిలేసినట్టుగా ఉంది, అసలు ఏ చోట కూడా కనెక్టివిటీ ఉండదనిపిస్తుంది రా ని రాయల్‌గా చూపించాలి ఇలా రోతలా కాదు ప్రతీ సారి వన్ లైనర్ పంచులతో సినిమా వర్కౌట్ అవ్వదు అని ఇంకా ఎప్పటికీ అర్థం అవుతుందో ఏమో ఇంత చెప్పినాక కూడా థియేటర్లో సినిమా చూస్తా అంటే మీ ఇష్టం అంటూ ఓ నెటిజన్ ఘాటుగా ట్వీట్ చేశాడు.కొందరేమో ఫస్ట్ హాఫ్ పర్లేదు అని చెబుతున్నారు కొన్ని చోట్ల సిద్దు కామెడీ వర్కౌట్ అయిందని అంటున్నారు బొమ్మరిల్లు భాస్కర్ ఇందులో ప్రతీ ఒక్క ఎమోషన్‌ను వాడుకుని చూపించారని, కాకపోతే అవేవీ కనెక్ట్ కావు అని చెబుతున్నారు. సెకండాఫ్ తేడా కొట్టేసిందని అంటున్నారు. జాక్ అనేది ఓ స్పై కామెడీ యాక్షన్ మూవీ అని.. అందులో స్పై మూమెంట్స్ కానీ కామెడీ కానీ వర్కౌట్ కాలేదని అంటున్నారు.. అన్ని కమర్షియల్ అంశాల్ని పొందుపర్చి సినిమాను తీయాలని అనుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్ఏ ఒక్క సీన్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు గందరగోళంగా నడిచే స్క్రీన్ ప్లే వీక్ రైటింగ్‌తో బోరింగ్ అనిపిస్తుందట.