Ntr: పవన్ కుమారుడు ప్రమాదంపై స్పందించిన ఎన్టీఆర్

Ntr: పవన్ కుమారుడు ప్రమాదంపై స్పందించిన ఎన్టీఆర్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్‌ స్కూల్‌లో చదువుకుంటున్న పవన్‌ కల్యాన్‌ చిన్నకుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌కి స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మార్క్‌ శంకర్‌ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు గురయ్యాడు. మార్క్ శంకర్‌ను స్కూల్ సిబ్బంది వెంటనే మార్క్‌ శంకర్‌ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisements

ఎన్టీఆర్ స్పందన

ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు,తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ గారి కుమారుడు గాయపడిన విషయం తెలిసి తాను ఎంతో బాధపడినట్లు తెలిపారు.చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా తారక్ ఆకాంక్షించారు.‘ధైర్యంగా ఉండు లిటిల్ వారియ‌ర్‌’ అంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.

సింగపూర్‌ కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:45 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ‘రివర్ వ్యాలీ రోడ్‌ షాప్‌ హౌస్’ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. అదే భవనంలోని స్కూల్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో15-19 మంది విద్యార్థులు గాయపడగా, ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మార్క్ శంకర్‌కు ప్రాణహాని లేకుండా కాపాడిన సిబ్బందికి ఏపీ మంత్రి నాదెండ్ల మనోహార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాదంపై సింగపూర్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ దర్యాప్తు చేస్తోంది.

హెల్త్ అప్డేట్

సింగపూర్‌లో అగ్నిప్రమాదం తర్వాత మార్క్‌ శంకర్‌కు ముందు అత్యవసర వార్డులో ఉంచి ఆ త‌ర్వాత సాధారణ గదికి తీసుకొచ్చారు మరో మూడు రోజులపాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి డాక్ట‌ర్స్ తెలిపిన‌ట్టు స‌మాచారం.ఆస్పత్రికి వెళ్లి మార్క్‌శంకర్‌ను చూసి అనంతరం వైద్యులతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో చేతులు, కళ్ళకు స్వల్ప గాయాలు అయ్యాయని చెప్పార‌ట‌ కాగా మార్క్ శంకర్ కు పెద్దగా ప్రమాదమేమీ లేద‌ని, చిన్నారి క్షేమంగానే ఉన్నాడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి, చిరంజీవి వైద్యులు తెలిపిన‌ట్టు స‌మాచారం. తాజాగా సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదల కాగా, ఇందులో తాను క్షేమంగా ఉన్నాన‌ని సింబాలిక్‌గా చెబుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఈ పిక్ చూసాక అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

Read Also: NTR: ఎన్‌టీఆర్‌ ప్ర‌శాంత్ నీల్ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్

Related Posts
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు?
nagababu ycp

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, జనసేన పార్టీ తరఫున ప్రముఖ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు Read more

AP schools : ఏపీలో ఇకపై ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’
Every Saturday will now be 'No Bag Day' in AP

AP schools : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుస్తకాల మోతకు స్వస్తి పలికేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు బ్యాగుల Read more

పుష్ప 2 లాభాలను పెన్షన్ గా పంచండి కోర్టులో పిటిషన్
పుష్ప 2' భారీ లాభాలు – కళాకారుల సంక్షేమానికి వినియోగించాలంటూ పిటిషన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త రికార్డు సృష్టించింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం Read more

వివేకా హత్య కేసు లో సాక్ష్యుల మరణాలపై సందేహాలు
వివేకా హత్య కేసు లో సాక్ష్యుల మరణాలపై సందేహాలు

వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక సాక్షులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు అనుమానాస్పదరీతిలో చనిపోవడం మరో సంచలనంగా మారింది.ఈ మరణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×