Ap Weather Report:ఏపీలో వచ్చే మూడు రోజులు వర్ష సూచనలు

Ap Weather Report:ఏపీలో వచ్చే మూడు రోజులు వర్ష సూచనలు

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ప్రాంతాలవారీగా మారుతూ ఉంటాయని సూచనలు ఇచ్చింది విపత్తుల నిర్వహణ…

అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం

Assembly: అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది….

తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక తీర్మానం చేశారు. ఈ తీర్మానం ద్వారా తెలంగాణా ప్రభుత్వ స్టాండ్ ను ప్రకటించి, డీ లిమిటేషన్ విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర వైఖరి మారాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజక వర్గాల పునర్విభజన - డీలిమిటేషన్ విధి విధానాలలో మార్పులు చేయాలని సూచించారు. శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ తీర్మానం శాసన సభలో డీ లిమిటేషన్ పై తీర్మానం ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు రాష్ట్రంలో శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభాలెక్కలకు అనుగుణంగా SC, ST స్థానాలను పెంచాలనీ కేంద్రాన్ని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లని విధంగా చేయాలని అభిప్రాయ పడ్డారు. నియోజక వర్గాల పెంపు పైన చర్చ దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ తో నష్టం కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజక వర్గాల పెంపు పైన చర్చ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదు గతంలో ఇందిరాగాంధీ ఆమోదించలేదన్న సీఎం రేవంత్ గతంలో ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక తాజాగా మరోమారు నియోజకవర్గాలు పునర్విభజన అంశం తెర మీదికి రావడంతో దక్షిణాది రాష్ట్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా అందరితో కలిసి కేంద్రానికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కడ్బందీగా కుటుంబ నియంత్రణ అమలు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై రేవంత్ ఆందోళన దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, ఫలితంగా రాష్ట్రాలకు నష్టం జరిగితే ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ విధానాన్ని సమగ్రంగా అమలు చేసినందుకు తమకే బెనిఫిట్ జరిగేలా చూడాలన్నారు. ఒకవేళ ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చట్టసభలలో 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్ విషయంలో రేవంత్ డిమాండ్ ఇదే డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని శాసన సభ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని ఆయన తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని డిమాండ్ చేశారు.

Delimitation: డీలిమిటేషన్ విషయంలో కేంద్రంతో యుద్ధం: రేవంత్ రెడ్డి

తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక తీర్మానం చేశారు. ఈ…

PawanKalyan: ద‌ర్శ‌కుడు ర‌మేశ్ కు సానుభూతి తెలిపిన ప‌వ‌న్ కళ్యాణ్

PawanKalyan: ద‌ర్శ‌కుడు ర‌మేశ్ కు సానుభూతి తెలిపిన ప‌వ‌న్ కళ్యాణ్

ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె హైదరాబాద్ లోని…

ట్రంప్ ఎఫెక్ట్ తో వరల్డ్ నెంబర్ వన్ కుబేరుడిగా ఎలాన్ మస్క్

Elon Musk: ట్రంప్ ఎఫెక్ట్ తో వరల్డ్ నెంబర్ వన్ కుబేరుడిగా ఎలాన్ మస్క్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టెస్లా స్టాక్ విలువ పెరగడంతో ఎలాన్…

సహకార్‌ యాప్‌తో ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌

Ola, rapido, uber: సహకార్‌ యాప్‌తో ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌

ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్‌, ర్యాపిడోల వినియోగం బాగా పెరిగిపోయింది. విపరీతంగా పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా.. ఆయా కంపెనీలు వినియోగదారుల…