కర్కాటక రాశి

కర్కాటక రాశి

కర్కాటక రాశి

19-03-2026  |  గురువారం
ఆదాయం 02
వ్యయం 11
రాజపూజ్యం 04
అవమానం 07

కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం వ్యయం, లగ్నం, ద్వితీయంలో గురువు, ద్వితీయం, లగ్నంలో కేతువు, అష్టమం, సప్తమంలో రాహువు, భాగ్యంలో శనీశ్వరుడు, గ్రహాల సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మి కుబేర హోమం జరిపించండి. మెడలో కౌముది ధరించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ ప్రయత్నాలలో ఫలితాలు లభిస్తాయి. సంతాన విషయంలో అసంతృప్తి ఏర్పడవచ్చు. చాలా విషయాల్లో నిర్ణయాలు మీ ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. కార్యాలయంలో కుట్రలు కుతంత్రాలు మరింతగా పెరిగిపోతాయి. అసత్య ప్రచారాలు వేగ లేని ఆరోపణలు మితిమీరి నడుస్తాయి. మనోవేదన కలిగి పదవికి రాజీనామా లేక పదవి తిరస్కరణ చేసే అవకాశం ఉంది. మీ పేరు లేదా మీ వాళ్ళ పేరు మీద స్థిరాస్థులు కొనుగోలు చేసి లాభపడతారు. విదేశాలలో ఉన్న మీ వారికి మంచి సలహాలు సూచనలు ఇచ్చి కొన్ని ప్రదేశాలలో ప్రాంతాలలో స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని వారి ద్వారా కూడా మీరు కొన్ని స్థలాలు బీనామీలుగా ఉండే అవకాశం ఏర్పడుతుంది.

ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షితులవుతారు. దీర్ఘకాలికంగా భావిస్తున్న కొన్ని సమస్యలకు వైద్యం తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. చెట్ల పెంపకము నర్సరీ నడిపే వారికి మంచి ఆదాయము పేరు లభిస్తుంది. మీ ద్వారా తీసుకున్న మొక్కలు బాగున్నాయని మంచి ప్రశంసలను పొందగలుగుతారు. ప్రజాధరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయగలుగుతారు. కుటుంబ పరమైన మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. కొంతమంది వేరే ఊర్లలో ఉండి ఉపాధి రీత్యా ప్రయత్నం చేయడము. వాళ్ళ భద్రత విషయాలలో కూడా మీరు కలగజేసుకొని జాగ్రత్తలు తీసుకుంటారు. అయిన వాళ్ళతో మాట పడాల్సిన స్థితి రావచ్చు. మనోబలం కోల్పోతున్నట్లుగా చాలా సందర్భాలలో అనిపిస్తుంది. పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనడమే మంచిది. విద్యావకాశాలు కలసివస్తాయి. విదేశాలలో చదువు కోసం గట్టి ప్రయత్నాలు చేయగలుగుతారు. భారతదేశంలో ఉన్నత చదువుల కోసంపై మంచి ప్రయత్నం చేస్తారు. మంచి కళాశాలలో సీటు సంపాదించి ఇంట్లో వాళ్ళు గర్వించే విధంగా మీ ఫలితాలు ఉంటాయి. ఎక్కడక్కడ ఉండి చదువుల రీత్యా ఇబ్బంది పడతారు. పోటీ ప్రపంచంతో పరిగెత్త లేక అలసటకు గురవుతారు. ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంటుంది.

లీజులు లైసెన్స్లో టెండర్ల కోసం ప్రయత్నిస్తారు. మీరు పొందినవి మరొకరికి ఇచ్చే అవకాశాలు కూడా ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధమైన ప్రాజెక్టులు పనులకు ప్రయత్నాలు చేస్తారు. సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. శుభకార్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఏవో కొన్ని అపోహలు పెట్టుకొని ప్రతి నిమిషం భయపడుతూ కొంతమంది ప్రవర్తన మాత్రం చికాకు కలిగిస్తుంది. ధైర్యం చెప్పి అండగా నిలబడి కష్టం వచ్చినా పరవాలేదులే నేనున్నానని చెప్పవలసిన వాళ్లు ఒకసారి కర్మ బాలేక జరిగినటువంటి అన్యాయాన్ని పదేపదే గుర్తుకు చేస్తూ మళ్ళీ అలానే జరుగుతుందేమో నీ బ్రతుకు బాగుపడదేమో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఎప్పటికప్పుడు నెగిటివ్ మాటలు మాట్లాడటం కొన్ని సందర్భాలలో భావోద్వేగాల గురిచేస్తుంది. ఋణ సదుపాయం లభిస్తుంది. అభివృద్ధి పథంలో శ్రమించి సంపాదన పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత స్థానాలలో ఉన్న వారి పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. వాళ్ళ శైలి విధానం మీకు ఎంతగానో నచ్చుతుంది. మీ జీవితంలో వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకొని మంచి ప్రయత్నాలు చేయాలనుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మానసిక ఊరట కలిగించే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కొంతకాలం భార్యాభర్తలిద్దరికీ అనారోగ్యం రావడం ఒకరికొకరు సహాయంగా ఉండటం ఉన్నదాంట్లో సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటబడ్డ తర్వాత మళ్లీ శక్తివంచనలు లేకుండా శ్రమించి ధనాన్ని కూడా పెట్టే ప్రయత్నాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం 60%
సంపద 80%
కుటుంబం 80%
ప్రేమ సంభందిత విషయాలు 60%
వృత్తి 80%
వైవాహిక జీవితం 60%
Sun

వారం - వర్జ్యం

తేది : 19-03-2026, గురువారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం , చైత్రమాసం , ఉత్తరాయణం వసంత ఋతువు , శుక్లపక్షం ఉత్తరాభాద్ర కార్తె
అమావాస్య ఉ.6.53 , సా. పాడ్యమి తె.4.51 , ఉత్తరాభాద్ర తె.4.03
వర్జ్యం: మ.2.26-3.52
రాహుకాలం: మ.1.30 - 3.00

మీకు నచ్చవచ్చు