ఇకపై మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్(Instagram Reels) చూస్తూ కళ్లకు ఇబ్బంది పడాల్సిన అవసరం తగ్గనుంది. ఇన్‌స్టాగ్రామ్ తాజాగా Insta TV యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా టీవీ స్క్రీన్‌పైనే రీల్స్, షార్ట్ వీడియోలను సులభంగా వీక్షించవచ్చు.
Read Also: Instagram: ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్

మొదట అమెజాన్ ఫైర్ టీవీల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభం
ప్రస్తుతం ఈ యాప్‌ను(Instagram Reels) అమెరికాలోని ఎంపిక చేసిన అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌పై ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారుల స్పందనను బట్టి త్వరలోనే ఇతర స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌కు కూడా విస్తరించనున్నట్లు తెలుస్తోంది.
టీవీల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం
టీవీల్లో డిజిటల్ కంటెంట్, సోషల్ మీడియా వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా వెల్లడించింది. పెద్ద స్క్రీన్‌పై కంటెంట్ చూడాలనే వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని Insta TV యాప్‌ను రూపొందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: