న్యూజిలాండ్‌తో ఈ నెలలో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్, తిలక్ వర్మ ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. టెస్టిక్యులర్ టార్షన్ అనే వైద్యపరమైన సమస్య కారణంగా అతనికి శస్త్రచికిత్స జరిగిందని, అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడని బీసీసీఐ ప్రకటించింది. రాజ్‌కోట్‌లోని ఒక ఆసుపత్రిలో ఈ నెల 7న తిలక్ వర్మకు ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.
Read Also: Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI
ఫిట్‌నెస్ సాధిస్తే
నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అతను, ఈరోజు హైదరాబాద్‌కు తిరిగి రానున్నాడు. ప్రస్తుతం తిలక్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. గాయం పూర్తిగా నయమై, శస్త్రచికిత్స గాట్లు పూర్తిగా మానిన తర్వాతే అతను తిరిగి శిక్షణ ప్రారంభిస్తాడని బోర్డు స్పష్టం చేసింది.
అతని నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ మొదలు పెడుతాడు. ఆ తర్వాత స్కిల్ బేస్‌డ్ యాక్టివిటీలు చేస్తాడు. ప్రస్తుతానికి తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్ సాధిస్తే మిగతా రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతాడు.’ అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: