हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Mohammad Kaif: విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ కైఫ్

Anusha
Mohammad Kaif: విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ కైఫ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ లో ప్రత్యర్థులను వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ సొంత వేదికపై మాత్రం మరోసారి ఓటమివైపు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో మాదిరిగానే పంజాబ్‌తోనూ అదే రిపీట్‌ అయింది. శుక్రవారం వర్షం అంతరాయంతో 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై ఘన విజయం సాధించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 96 పరుగుల ఛేదనలో పంజాబ్‌ 12.1 ఓవర్లలో 98/5 స్కోరు చేసింది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్‍ను 14 ఓవర్లకు కుదించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కొన్ని పరుగులకే ఔటయ్యారు.

తీవ్ర నిరాశ

2025 సీజన్‌ లో ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. విరాట్ కోహ్లీ 7 మ్యాచ్‌ల్లో 249 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 49.8 సగటు, 141.47 స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. కోహ్లీ మూడు హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.ఈ పరిస్థితిలో 14 ఓవర్ల మ్యాచ్‌లో వారిద్దరూ దూకుడుగా ఆడతారని భావించినప్పటికీ.. ఇద్దరూ వరుసగా ఔటవ్వడం తీవ్ర నిరాశ కలిగించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కేవలం 3 బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దీని కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరుగులు సాధించడంలో ఇబ్బంది పడింది. 14 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 12.1 ఓవర్లలోనే సాధించింది.

 Mohammad Kaif: విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ కైఫ్

మొదటి బంతి

భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ మొదటి బంతి నుంచే కొట్టడానికి ప్రయత్నించాడు. కోహ్లీ సాధారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌లలో ఇలా కొట్టడు. ఇది 14 ఓవర్ల మ్యాచ్ కాబట్టి విరాట్ కోహ్లీ మొదటి బంతి నుంచే కొట్టాలని అనుకున్నాడు. కానీ ఇంత కఠినమైన పిచ్ లపై ముందుగా కొంత సమయం తీసుకోవాలి. విరాట్ కోహ్లీ మొదటి 5 బంతుల వరకు కొంచెం ఓపికగా ఉండి.. ఆ తర్వాత ఆటలోకి దిగి ఉండవచ్చు. కానీ విరాట్ కోహ్లీ దీనిని 6 ఓవర్ల మ్యాచ్ అనుకున్నాడు. అందుకే చెడు షాట్ ఆడి ఔట్ అయ్యాడు” అని మహ్మద్ కైఫ్ విమర్శించాడు.

Read Also: IPL 2025: ఐపీఎల్ సీజన్లో లో ప్లే ఆఫ్స్ కు చేరే జట్లు ఏవో తెలుసా!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870