हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఎల్ఎస్ జి మ్యాచ్ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన రిషభ్ పంత్

Anusha
IPL 2025: ఎల్ఎస్ జి మ్యాచ్ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో శనివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ 2 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.ఆఖరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో లక్నో పేసర్‌ అవేశ్‌ఖాన్‌ అద్భుతం చేశాడు. హెట్‌మైర్‌(12)ను ఔట్‌ చేసిన అవేశ్‌ 6 పరుగులే ఇచ్చుకుని లక్నోకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. దీంతో 181 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 178/5 కు పరిమితమైంది. యశస్వీ జైస్వాల్‌ (52 బంతుల్లో 74, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్‌ ఫామ్‌ను కొనసాగించగా కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (39) మెరిశాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 14 ఏండ్ల చిన్నోడు వైభవ్‌ సూర్యవంశీ (20 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 180/5 పరుగులు చేసింది. మార్క్మ్‌ (45 బంతుల్లో 66, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అయుశ్‌ బదోని (34 బంతుల్లో 50, 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

బదోని

జోరు మీదున్న మిచెల్‌ మార్ష్‌ (4)ను మూడో ఓవర్లోనే ఆర్చర్‌ పెవిలియన్‌కు పంపి రాయల్స్‌కు తొలి బ్రేక్‌నిచ్చాడు. ఆరెంజ్‌ క్యాప్‌ వీరుడు నికోలస్‌ పూరన్‌ (11)ను సందీప్‌ శర్మ వికెట్ల ముందు బలిగొనగా కెప్టెన్‌ పంత్‌ (3) వైఫల్య ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగింది. 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో లక్నోను మార్క్మ్‌,బదోని ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 76 రన్స్‌ జోడించారు. 31 బంతుల్లో మార్క్మ్‌ అర్ధశతకాన్ని పూర్తిచేశాక బ్యాట్‌ ఝుళిపించాడు. మరో ఎండ్‌లో బదోని కూడా వేగంగా ఆడాడు. అయితే ఈ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ (10 బంతుల్లో 30 నాటౌట్‌, 4 సిక్సర్లు) మెరుపులతో లక్నో పోరాడగలిగే స్కోరును సాధించింది.

 
IPL 2025: ఎల్ఎస్ జి  మ్యాచ్ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన రిషభ్ పంత్

అద్భుతమైన

మ్యాచ్ విజయంపై రిషభ్ పంత్ మాట్లాడుతూ,ఈ విజయం బిగ్ రిలీఫ్‌తో పాటు సంతోషాన్నిచ్చింది. ఇలాంటి మ్యాచ్‌లే మన వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. ఇదో అద్భుతమైన విజయం. ఈ గెలుపు మా జట్టును మరో స్థాయికి తీసుకెళ్తోంది. ఈ రకమైన మ్యాచ్‌లు జట్టుతో పాటు ఆటగాళ్ల క్యారెక్టర్‌ను బిల్డ్ చేస్తాయి. మేం ఎప్పుడూ మాట్లాడుకునే సానుకూలంశాలు ఇవే. ముందు ముందు మా నుంచి మెరుగైన ప్రదర్శన వస్తుందని భావిస్తున్నా. ఈ గెలుపు క్రెడిట్ బౌలర్లదే. సరైన సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇది అంత సులువైన విజయం కాదు. ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు మేం వెనుకబడే ఉన్నాం. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. కానీ మా బౌలర్లు ధైర్యంగా బౌలింగ్ చేశారు.ముఖ్యంగా ఆవేశ్ ఖాన్ అదరగొట్టాడు. మూడు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్‌లో కావాల్సిన టైమ్ తీసుకొని స్పష్టమైన మైండ్‌సెట్‌తో బౌలింగ్ చేయాలని చెప్పాను. ఒక్కో బంతిని మెరుగ్గా వేస్తూ ఆఖరి వరకు మ్యాచ్ తీసుకెళ్లాలనేది మా వ్యూహం. ఇలాంటి సమయంలో బౌలర్లు, ఫీల్డర్లపై నమ్మకం ఉంచడం చాలా కీలకం. మేం సానుకూల దిశలో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. ఆ తర్వాత మేం మెరుగవ్వాల్సిన విషయాలపై ఫోకస్ పెడ్తాం.’అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

Read Also: IPL 2025: రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870