ఇంగ్లండ్ కెప్టెన్సీకి బట్లర్ గుడ్ బై

ఇంగ్లండ్ కెప్టెన్సీకి బట్లర్ గుడ్ బై

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఒక పెద్ద షాక్ తగిలింది. ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన తర్వాత జోస్ బట్లర్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి రాజీనామా చేశాడు. బట్లర్ తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో శనివారం జరగబోయే మ్యాచ్ తన చివరి మ్యాచ్‌గా ఉండనుందని వెల్లడించాడు.

ఇంగ్లాండ్ చాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లాండ్, బుధవారం పాకిస్తాన్‌లోని లాహోర్‌లో టోర్నమెంట్‌లో అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్‌పై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన ఇంగ్లాండ్బట్లర్ కెప్టెన్సీలో వరుస పరాజయాలు.

జోస్ బట్లర్

ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ తప్పుకున్నాడు. అతను వైట్ బాల్ ఫార్మాట్ పదవికి రాజీనామా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగే గ్రూప్ లీగ్ దశ మ్యాచ్‌లో చివరిసారిగా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తానని బట్లర్ చెప్పుకొచ్చాడు. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ శనివారం కరాచీ మైదానంలో జరుగుతుంది.గత వారం, ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత, ఆ జట్టు లాహోర్ మైదానంలో ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్కోరు బోర్డుపై 325 పరుగులు చేసింది. ఇందులో ఇబ్రహీం జద్రాన్ 177 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. అంతకుముందు ఆ జట్టు భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 3-0తో, టీ20లో 4-1తో ఓడిపోయింది. ఇయాన్ మోర్గాన్ రిటైర్ అయినప్పుడు బట్లర్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్.

బట్లర్ రాజీనామా

చాంపియన్ ట్రోఫీలో ఇంగ్లండ్ టీమ్ దారుణ వైఫల్యంతో పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశారు. కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు బట్లర్ ప్రకటించాడు. వరుస పరాజయాల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా, ఆటగాడిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు.చ్ బ్రెండన్ మెక్ కల్లమ్‌తో కలిసి వేరే ప్లేయర్ జట్టును ముందుకు నడిపిస్తారని చెప్పాడు. ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించడం తన జీవితంలో గర్వకారణమని అన్నాడు.

కొత్త కెప్టెన్ ఎవరు?

బట్లర్ జట్టు నాయకత్వం నుంచి పక్కకు తప్పుకున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న హ్యారీ బ్రూక్‌ను నియమిస్తారనే వార్తలు వినబడుతున్నాయి.  

Related Posts
Cheteshwar Pujara: ఛ‌టేశ్వర్ పుజారా స్ట‌న్నింగ్ ఫీట్‌.. కోహ్లీ, రోహిత్‌ల‌కు అంద‌నంత దూరంలో స్టార్ క్రికెట‌ర్‌
cheteshwar

టీమిండియా క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించి తన ఘనమైన కెరీర్‌కు మరో మైలురాయిని చేర్చాడు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ Read more

ఐపీఎల్ జ‌ట్ల‌కు బీసీసీఐ షాక్‌
IPL 2025కి ముందే పెద్ద షాక్‌ – బీసీసీఐ కొత్త నిబంధనలివే

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జట్ల ప్రాక్టీస్ సెషన్లపై కఠిన ఆంక్షలు విధించింది. గతంతో పోలిస్తే ఈసారి ప్రాక్టీస్ సెషన్ల Read more

చెన్నై కొత్త బౌలర్‌ను చితక బాదిన పాండ్యా..
hardik pandya smashed 29 runs in gurjapneet singh over

2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆడాడు. తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. Read more

IPL 2025: ఇంగ్లాండ్, భారత్ ఎన్ని కోట్లు తీసుకుందంటే?
IPL 2025 ఇంగ్లాండ్ భారత్ ఎన్ని కోట్లు తీసుకుందంటే

ఐపీఎల్ 2025 త్వరలో ప్రారంభం కానుంది మరియు అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈసారి ఐపీఎల్ సీజన్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుంది. ఫిబ్రవరిలో మొదటి మ్యాచ్ ఫైనల్ Read more