KTR comes forward for organ donation

KTR: అవయవ దానానికి ముందుకు వచ్చిన కేటీఆర్

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అవయ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. శాసనసభలో అవయవదానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయవ దానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తేవాలని చెప్పారు.

Advertisements
అవయవ దానానికి ముందుకు వచ్చిన

అవయవదానంపై మెుదటి సంతకం నేనే చేస్తా

ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామన్నారు. అవయవదానంపై మెుదటి సంతకం తానే చేస్తానని వెల్లడించారు. అవయవదానం గొప్ప మానవీయ చర్య అని, మరింత మందికి జీవితాన్నిస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇక, అవయవదానం బిలుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అవయవదానంపై పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరమని.. అభినందనలు తెలుపుతున్నామన్నారు. నాకున్న సమాచారం మేరకు ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు.

ఈ బిల్లు వీరందరికీ ఎంతో ఊరట చెందే విషయం

ఈ రోజు పెట్టిన బిల్లు వీరందరికీ ఎంతో ఊరట చెందే విషయం. ఈ బిల్లు ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్‌కు అవయవదానం చేసే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా స్వాప్ ద్వారా పరస్పరం అవయవ దానం చేసుకునే అవకాశం కలుగుతుంది. అవయవాల మార్పిడి దందా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని న్యూరో ఫిజీషియన్లు మాత్రమే నిర్థారించే వారు. ఈ బిల్లు ద్వారా డాక్టర్లందరూ నిర్ధారణ చేసే అవకాశం కల్పించారు. దీంతో త్వరగా నిర్థారణ చేసి, అవయవ దానం చేసే అవకాశం కలుగుతుంది. జీవన్ దాన్ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది.

Related Posts
Harish Rao : కేసీఆర్ చావు కోరుకోవడం దారుణం : హరీశ్ రావు
Wishing KCR death is cruel.. Harish Rao

Harish Rao : తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్‌ చావును కోరుకోవడం ఎంత దారుణమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే Read more

రూ.300కే ఇంటర్నెట్ సేవలు – తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Telangana Villages to Get I

ప్రజలందరికీ అధునాతన డిజిటల్ కనెక్టివిటీ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలా కొత్త పథకాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా Read more

సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీని దోషిగా తేల్చిన కోర్టు
1984 anti Sikh riots murder

ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన ఘోర ఘటన 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ రౌస్ Read more

Hyderabad:పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త
Hyderabad:పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త

అనుమానం ఒక కుటుంబాన్ని నాశనంచేసింది.భార్యను కోల్పోయేంత పరాకాష్టకు ఓ భర్త చేరుకున్నాడు.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×