IPL2025: అమల్లోకి బీసీసీఐ కొత్త రూల్స్‌..ఏంటి ఆ నియమాలు!

IPL2025: అమల్లోకి బీసీసీఐ కొత్త రూల్స్‌..ఏంటి ఆ నియమాలు!

(ఐపిఎల్ ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. 18వ సీజన్‌ కోసం బీసీసీఐ కొత్తగా మూడు నిబంధనలను తీసుకురావడం విశేషం. అందులో ముఖ్యమైనది ‘రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి’ అనే రూల్. ఈ రూల్‌ను బుధవారం రాజస్థాన్ రాయల్స్ – కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి అమలు చేశారు. అయితే, కొత్త బంతిని తీసుకున్నా రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించలేకపోయింది. కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisements

మ్యాచ్ హైలైట్స్

కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో బంతిని మార్చాలని అంపైర్లను కోరింది. కొత్త బంతిని తీసుకున్నాకేకేఆర్‌ చేతిలో రాజస్థాన్‌ పరాజయం పాలైంది. రాజస్థాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్‌లో క్వింటన్‌ డికాక్‌ 61 బంతుల్లో 97 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

ఎనిమిది వికెట్ల తేడా

కేకేఆర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ అజేయంగా 97 పరుగులు చేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లు వరుణ్‌ 17 పరుగులకు రెండు, మోయిన్‌ అలీ 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేకేఆర్‌ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మొయిన్ అలీ (5), కెప్టెన్ అజింక్య రహానే (18) వికెట్లను త్వరగానే కోల్పోయిన కేకేఆర్‌ను.. రఘువంశి (22)తో కలిసి క్వింటన్‌ డికాక్‌ గెలిపించాడు. డికాక్‌ 61 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది బౌండరీల సహాయంతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

l21820250326224717

రెండవ బంతి రూల్

బీసీసీఐ సెకండ్‌ బాల్‌ రూల్‌ని పరిచయం చేసింది. సాయంత్రం జరిగే మ్యాచులకు రెండో ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ నుంచి కొత్త బంతి ఇస్తారు. అయితే, ఆన్ ఫీల్డ్ అంపైర్లు మంచును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కొత్త బంతి ఇవ్వాలా,వ‌ద్దా,అనే నిర్ణయం తీసుకుంటారు. ఈ రూల్‌ మధ్యాహ్నం మ్యాచ్‌లకు వర్తించదు. రాత్రి మ్యాచుల్లో మంచు ప్రభావాన్ని తగ్గించే విషయంలో సెకండ్‌ బాల్‌ రూల్‌ని ప్రవేశపెట్టింది.

బ్యాట్స్ మ్యాన్

మంచు కారణంగా బౌలర్లు బంతిని పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఇది బ్యాట్స్ మ్యాన్ కు, టార్గెట్ సయయంలో వారికి భారీ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బీసీసీఐ రాత్రి మ్యాచుల్లో రెండో బంతిని ఉపయోగించడానికి అనుమతించే రూల్ ను బీసీసీఐ తీసుకువచ్చింది. రూల్ ప్రకారం రెండవ ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత మైదానంలో ఉన్న అంపైర్ బంతి పరిస్థితిని అంచనా వేస్తారు. అధిక మంచు కురుస్తున్నట్లు గుర్తిస్తే,ఫీల్డింగ్‌ జట్టుకు కొత్త బంతిని ఉపయోగించేందుకు అనుమతి ఇస్తారు.

Related Posts
మహారాష్ట్ర రైలు ప్రమాదం వేదనకు గురిచేసింది – పీఎం మోదీ
Jalgaon Train Tragedy

మహారాష్ట్రలో జలగావ్ జిల్లాలో జరిగిన భయానక రైలు ప్రమాదం దేశాన్ని శోకసాగరంలో ముంచెత్తింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ప్రధాని నరేంద్ర Read more

ట్రంప్ లాగా మన నాయకులు చేయలేరా?
flights

అమెరికా వెళ్లాలనే కల చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే.. మన భారత్ లో కంటే అమెరికాలో జీవన విధానం బాగుంటుంది. ఇక్కడ ఒక్క రూపాయి సంపాదిస్తే.. అక్కడ Read more

Team India: టీమిండియా 462 ఆలౌట్… న్యూజిలాండ్ టార్గెట్ 107 పరుగులు
ind vs nz 462

బెంగళూరులో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది ఈ ఫలితంతో న్యూజిలాండ్‌కు 107 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు ఈ ఇన్నింగ్స్‌లో Read more

ప్రధాని ఫ్రాన్స్‌, అమెరికా పర్యటన షెడ్యూల్‌ ఖరారు..
The schedule of pm modi visit to France and America has been finalized

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 12న ఆయన అగ్రరాజ్యానికి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే పర్యటిస్తారు. 13న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×