సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

Donald Trump: సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా, మెక్సికో, కెనడాల మాదిరి భారత్‌తో అమెరికా ప్రవర్తించకపోవచ్చని వెల్లడించాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి. భారత్‌తో తమకు టారిఫ్‌ సమస్య మాత్రమే ఉందని వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలమని అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధుల బృందం వెల్లడించినట్లు తెలిసింది.

Advertisements
సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన ప్రతీకార సుంకాలు వచ్చేనెల 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చర్చలను ముమ్మరం చేశాయి. టారిఫ్‌లపై చర్చించేందుకు ఈనెల మెుదట్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాకు వెళ్లారు. తాజాగా అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధి బృందం దిల్లీలో పర్యటిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది.
సజావుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతిపాదిత టారిఫ్‌ల నుంచి భారత్‌ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి. కొన్ని కీలక రంగాలకు చెందిన ఉత్పత్తులపై తక్కువ టారిఫ్‌ ఉండేలా అమెరికా ప్రతినిధి బృందంతో, కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారని జాతీయ మీడియా పేర్కొంది.
అమెరికా ప్రతీకార సుంకాల వల్ల భారత్‌కు చెందిన 87 శాతం ఉత్పత్తులపై ప్రభావం పడొచ్చని కేంద్ర ప్రభుత్వం జరిపిన అంతర్గత విశ్లేషణలో వెల్లడైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ యోచిస్తోందని తెలిపింది. వచ్చేనెల రెండు లోపు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

Related Posts
 ప్రపంచ హలో దినోత్సవం..
hello day

ప్రపంచ హలో డే, నవంబర్ 21న జరుపుకుంటారు, ఇది కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, శాంతిని కాపాడటంలో దాని పాత్రను వెలుగులోకి తెస్తుంది. ఈ రోజు మనం Read more

IPL2025: ఈ రోజు ఐపీఎల్ లో డబల్ ధమాకా..ఫ్యాన్స్‌కి పండగే!
IPL2025: ఈ రోజు ఐపీఎల్ లో డబల్ ధమాకా..ఫ్యాన్స్‌కి పండగే!

క్రికెట్ అభిమానులకు ఈ రోజు పండగే. ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు డబుల్ హెడర్స్ జరగనుండడంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.మధ్యాహ్నం ఒక మ్యాచ్, రాత్రి మరో Read more

IPL2025 :రిషబ్ పంత్‌కు సంజీవ్ గోయెంకా హెచ్చరిక.. ఎందుకంటే!
IPL2025 :రిషబ్ పంత్‌కు సంజీవ్ గోయెంకా హెచ్చరిక.. ఎందుకంటే!

ఐపీఎల్ 2025 సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ Read more

డీప్‌సీక్‌పై దక్షిణ కొరియా నిషేధం..
South Korea Ban on DeepSeek

సియోల్: ఏఐ రంగంలో తాజా సంచలనం కలిగించిన చైనా సంస్థ డీప్‌సీక్ ఒకవైపు దూసుకెళ్తోంది. మరోవైపు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు దీనిని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×