हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jayaprakash Narayan: జేపీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?

Anusha
Jayaprakash Narayan: జేపీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?

జమ్ము కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు.సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులను చుట్టుముట్టారు. వారి పేర్లు అడుగుతూ ముఖ్యంగా హిందువులు, పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా విషయం తెలుసుకున్న భారత బలగాలు క్షతగాత్రులకు సాయం చేశారు. ఆపై పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.13 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో పౌరులపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. మరోవైపు, పాకిస్థాన్ సైతం సరిహద్దుల్లో అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడితో భారత్‌ తమపై 2019 పుల్వామా ఆత్మాహుతి ఘటన తర్వాత దాడిచేసినట్టు మరోసారి మెరుపు దాడులకు దిగుతుందేమోనని దాయాది భావిస్తోంది.దీంతో ఈ దాడికి కారణమైన పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య 1960లో కుదిరిన కీలకమైన సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ భారత్ నిర్ణయంతో ఆందోళనకు గురవుతోంది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు భారత్ చేసిన ప్రకటన పట్ల పాకిస్థాన్ రాజకీయ నేతలు, ఉగ్ర నేతలు మండిపడుతున్నారు. సింధూ జలాలను పాకిస్థాన్‌కు రాకుండా ఆపితే సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుందని లష్కరే తోయిబా చీఫ్ సయ్యద్ హఫీజ్ హెచ్చరించారు.

ఇబ్బంది

సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసిన విషయమై లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ స్పందించారు. సింధూ జలాల ఒప్పందం రద్దుతో పాకిస్థాన్‌కు వచ్చే నష్టమేమీ ఉండదని జేపీ స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై అవగాహన లేకుండానే సయ్యద్ హఫీజ్ మూర్ఖంగా మాట్లాడుతున్నాడన్నారు.‘సింధూ నదిలో నీటి ప్రవాహం గోదావరి నది కంటే రెండున్నర రెట్లు అధికంగా ఉంటుంది. ఏడాది పొడవునా ఈ నదిలో నీళ్లు అందుబాటులో ఉంటాయి. సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ 80 శాతం, భారతదేశం 20 శాతం చొప్పున నీటిని వాడుకునేలా నిర్ణయించారు. కానీ దాదాపు 84 శాతం జలాలను పాకిస్థాన్ వాడుకుంటుండగా భారత్ వినియోగం 16 శాతానికి మాత్రమే పరిమితమైంది’’ అని జేపీ చెప్పుకొచ్చారు.సింధు జలాల ఒప్పందం ప్రకారం దౌత్య పరంగా ఇరు దేశాల ప్రయోజనాలు కాపాడాలని మాత్రమే మనం పట్టుబడుతున్నాం తప్పితే పాకిస్థాన్‌ను ఇబ్బంది పెట్టాలనేది భారత్ ఉద్దేశం కాదని జయప్రకాష్ నారాయణ వివరించారు. సింధూ జలాలను ఆపినా మన దగ్గర నిల్వ చేసుకునే అవకాశం లేదన్నారు. ఒప్పందం ప్రకారం రావాల్సిన వాటాలో సుమారు 300 టీఎంసీల నీటిని కూడా భారత్ వాడుకోవడం లేదని జేపీ గుర్తు చేశారు. మన భూభాగం నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవహించే చీనాబ్ నది జలాలను రావి, బియాస్ నదులకు టన్నెల్ ద్వారా మళ్లించి మనం వాడుకున్నప్పటికీ పాకిస్థాన్‌కు వచ్చే నష్టమేమీ లేదన్న జేపీ పాకిస్థాన్ అనవసరంగా అడ్డుపడుతోందన్నారు.

 
Jayaprakash Narayan: జేపీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?

ఒప్పందం

ప్రపంచంలో రెండు దేశాల మధ్య నదీ జలాల కోసం చేసుకున్న గొప్ప ఒప్పందంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని జేపీ అభివర్ణించారు. అప్పట్లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించి ఈ ఒప్పందం కుదిర్చిందని, ఆ మధ్య తలెత్తిన వివాదాన్ని కూడా వరల్డ్ బ్యాంకే పరిష్కరించిందని వివరించారు.1960వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు దిశగా ప్రవహించే బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారతదేశానికి పశ్చిమానికి ప్రవహించే సింధు, చినాబ్, జీలం నదులపై పాకిస్థాన్ నియంత్రణ ఉంటుంది. 

Read Also: Mark Carney: కెనడా ఎన్నికల్లో మార్క్ కార్నీ విజయం.. మోదీ శుభాకాంక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870