భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ ఆపరేషన్ తర్వాత పాక్ భారత్‌లోని ప్రధాన నగరాల లక్ష్యంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే భారత్ సరిహద్దు నగరాల్లో డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు పాల్పడిన పాక్ దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) అలర్ట్ అయ్యారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్-పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు సర్దుమణిగే వరకు హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నగరంలో బాణాసంచా కాల్చడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని ఆయన అభిప్రాయ పడ్డారు. బాణాసంచా శబ్ధాలు సైతం పేలుళ్ల సంభవించినప్పుడు ఏర్పడే శబ్దాల వలే ఉండటంతో, ఇవి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేందుకు దారితీయొచ్చని ఆయన భావించారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించడం, శాంతిభద్రతలను కాపాడటం వంటి లక్షాలతోనే సీపీ ఆనంద్(CP Anand)ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని సీవీ ఆనంద్ తెలిపారు.అయితే ఎవరైన ఈ ఆంక్షలను ఉల్లంఘించి బాణసంచా కాల్చినట్టు తెలుస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్ట్యా అందరూ ఈ నిషేధాన్ని పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
అవకాశం
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ ఆనంద్ హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫస్లీ (నం. IX) సెక్షన్ 67 (సి) కింద ఆయనకు అప్పగించిన అధికారాలను వినియోగించుకుంటూ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటే బాణాసంచాపై నిషేధం విధించే అధికారం పోలీసులకు ఉంటుంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నిషేధాజ్ఞలు తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతాయని తెలిపారు.ఈ నిషేధం కేవలం బాణాసంచా కాల్చడంపై మాత్రమే కాకుండా, వాటి అమ్మకాల(Sales)పై కూడా వర్తిస్తుంది. లైసెన్స్ ఉన్న బాణాసంచా దుకాణదారులు కూడా ఈ సమయంలో బాణాసంచా అమ్మకాలు జరపకూడదని పోలీసులు హెచ్చరించారు.

అప్రమత్తంగా
ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి లైసెన్సులు రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు.హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేడుకల్లో బాణాసంచా కాల్చకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Read Also :Supreme Court: కోర్టు ధిక్కారం కేసులో డిప్యూటీ కలెక్టర్‌కు జరిమానా