ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా నగరంలో ఓ భర్త తన భార్యను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 15 ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భార్యపై వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను సుత్తితో మర్డర్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.పూర్తి వివరాలు మీకోసం,అస్మా ఖాన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సెక్టార్ 62లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమె ఇంతకుముందు ఢిల్లీలో నివసించేది. జామియా మిలియా ఇస్లామియా నుండి ఇంజనీరింగ్ పట్టా పొందింది. నిందితుడు బీహార్‌కు చెందినవాడు. అతను కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు.వీరికి 2005లో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారి కుమారుడు ఇంజనీరింగ్ విద్యార్థి కాగా, కుమార్తె 8వ తరగతి చదువుతోంది.ఈ సంఘటన గురించి మొదట వారి కుమారుడు 112కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేసినట్లు అధికారులు తెలిపారు.సమాచారం అందిన వెంటనే, మా బృందం ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము. బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపాము. మరింత విచారణ జరుగుతోంది” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాంబాదన్ సింగ్ తెలిపారు.హైదర్ తన భార్య వివాహేతర సంబంధాలు కలిగి ఉందని అనుమానించాడని ప్రాథమిక విచారణలో తేలింది. “ఈ ఉదయం వారి కుమార్తె నాకు ఈ విషయం చెప్పింది. వారు చాలా రోజులుగా గొడవ పడుతున్నారు. అతను ఇంత దారుణమైన చర్యకు పాల్పడతాడని మేము ఊహించలేదు” అని బాధితురాలి బావ తెలిపారు.

కేసు నమోదు
భర్త నూరుల్లా హైదర్ తన భార్యపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ వాదనలు చేస్తూ వచ్చినట్టు తెలిసింది. ఈ అనుమానమే చివరకు హత్యకు దారితీసింది.వీరి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, కోపానికి గురైన హైదర్ అర్ధరాత్రి సమయంలో సుత్తితో భార్యపై దాడి చేశాడు.తీవ్రంగా గాయపడిన అస్మా ఖాన్ అక్కడికక్కడే మరణించింది.అస్మా బావ మీడియాతో మాట్లాడుతూ,ఇంత దారుణంగా ఆమెను హత్య చేస్తాడని ఊహించలేకపోయాం,” అని వాపోయారు. పిల్లల భవిష్యత్తుపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సంఘటనకు సంబంధించి నొయిడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదర్ గతంలో మానసిక సమస్యలతో బాధపడ్డాడా? లేదా అని దీని వెనుక ఇతర కారణాలున్నాయా అనే దానిపై విచారణ సాగుతోంది.వారి మధ్య గత కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.