Kodali Nani: నాని ఆరోగ్యంపై వైద్యుల కీలక ఆదేశాలు

Kodali Nani: నాని ఆరోగ్యంపై వైద్యుల కీలక ఆదేశాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా నిలిచిన మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా సేవలందించిన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని ఆరోగ్యం పై కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నానికి, ఇటీవల ముంబైలో బైపాస్ శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు ప్రకటించారు.

Advertisements

బైపాస్ సర్జరీ విజయవంతం

ముంబైలోని ప్రసిద్ధి చెందిన ఆసుపత్రి ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో దేశంలోనే పేరొందిన హార్ట్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో ఈ బైపాస్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స దాదాపు 8 గంటల పాటు కొనసాగింది. ఆపరేషన్ పూర్తయ్యాక నానిని ఐసీయూలో ఉంచి పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం నానిని ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్లు సమాచారం. కొడాలి నాని ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, ఆపరేషన్ విజయవంతం అయిన అనంతరం క్రమంగా కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆస్పత్రిలోనే నానిని నెమ్మదిగా నడిపిస్తున్నట్లు వారు చెబుతున్నారు. తాము వీడియో కాల్ ద్వారా వైద్యుల నుంచి సమాచారం పొందుతున్నామని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ప్రస్తుతం ఆసుపత్రి పరిధిలోనే ఉన్నారు.

జగన్ స్పందన

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ఆయనే స్వయంగా వైద్యులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. అంతేకాకుండా, జగన్ సూచనల మేరకే నానిని ముంబైకి తరలించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం మేరకు, నాని డిశ్చార్జ్ విషయాన్ని జగన్‌కి అధికారికంగా తెలియజేశారు. నానిని పరామర్శించేందుకు పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పెర్నీ నాని ముంబైకి వెళ్లనున్నారు. కోలుకున్న కొడాలి నాని గుండె ఆపరేషన్ తరువాత కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. సర్జరీ తరువాత పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఐసీయూ నుంచి సాధారణ రూమ్ కు తరలించారు. కొడాలి నాని తిరిగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలోనే నెమ్మదిగా నడిపించినట్లు నాని కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. కొడాలి నాని ఈ నెల 19 లేదా 20న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరిగి హైదరాబాద్ లోని ఏజీఐ లో భవిష్యత్ చికిత్స తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొడాలి నాని కోలుకోవటంతో మరి కొంత కాలం హైదరాబాద్ లోనే ఉండనున్నారు. వచ్చే నెల మరోసారి ముంబాయి ఆస్పత్రిలో చెకప్ కోసం వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. డిశ్చార్జ్ అనంతరం కొడాలి నాని పూర్తిగా రాజకీయాలకు విరామం తీసుకోవాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. ఫిజికల్, మెంటల్ రెస్ట్ అవసరమని పేర్కొన్నారు. పార్టీ నేతలు కూడా ఈ విషయం మీద స్పష్టత ఇచ్చారు. త్వరగా కోలుకున్న తర్వాతే తిరిగి ప్రజల్లోకి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు తెలియజేశాయి.

Read also: Anna Lezhneva: టీటీడీ అన్న‌దానానికి భారీ విరాళమిచ్చిన పవన్ క‌ల్యాణ్ సతీమణి

Related Posts
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

దాదాపు రెండు దశాబ్ధాల కిందట ఐటీ రంగం ప్రాముఖ్యతను దేశంలో ముందుగా గ్రహించి అమెరికా దిగ్గజ కంపెనీల సీఈవోలను కూడా హైదరాబాదుకు తీసుకొచ్చిన వ్యక్తి ఏపీ సీఎం Read more

MLA : ప్రతీ ఎమ్మెల్యే రూ.25వేలు ఇవ్వాలి – రేవంత్
1409247 revantha

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే తన Read more

అరెస్ట్‌ వార్తలపై కేటీఆర్ ట్వీట్
KTR tweet on the news of the arrest

హైదరాబాద్‌: తనపై నమోదైన కేసులపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు గుడ్ లక్ చిట్టినాయుడు అంటూ కేటీఆర్‌ చురకలు అంటించారు. శునకానందం పొందాలనుకుంటే.. నీ Read more

మూవీ జాకీని (ఎంజే) పరిచయం చేసిన పివిఆర్ ఐనాక్స్ ..
PVR Inox introduced Movie Jockey MJ

పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్ మూవీ జాకీని (ఎంజే)ని ప్రారంభించింది. ఇది మూవీని కనుగొనడాన్ని మరియు భారతదేశంవ్యాప్తంగా ఉన్న మూవీ ప్రేమికులకు బుక్కింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు వ్యక్తిగతం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×