టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్-ఇండియా హిట్ చిత్రాలు కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.#NTRNeel అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31గా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్.ఈ నెల 22 నుంచి తారక్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ క్రేజీ అప్‌డేట్‌తో ఎన్‌టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.
మూవీ షూటింగ్
గతేడాది ‘దేవర’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడాయన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది.శ్రీలంక, మెక్సికో, ఉక్రెయిన్ సహా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు దాదాపు 100 రోజులు డేట్స్ ఇచ్చారట.అందుకే ప్రీ ప్రొడక్షన్ పనులకే దాదాపు ఏడాది పట్టింది. చిత్ర నిర్మాతలు కథకు ప్రాణం పోసేందుకు భారీ సెట్లు వేయనున్నట్లు తెలుస్తోంది.ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లో తారక్ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించనుందని ప్రచారం సాగుతోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
లిఖితారెడ్డి పోస్ట్
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన రోజు నీల్ సతీమణీ లిఖితారెడ్డి ఓ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ సెట్స్‌లోకి వచ్చేందుకు వెయిట్ చేస్తున్నానంటూ రాసుకొచ్చారు. ‘ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. అతడు (ప్రశాంత్) మైక్ పట్టాడంటే, చరిత్ర తిరగరాస్తాడు. విధ్వంసం ఇప్పుడే ప్రారంభమైంది. ఎన్టీఆర్ అన్న సెట్స్‌పైకి వచ్చేవరకు వెయిట్ చేయలేకపోతున్నా’ అని లిఖిత పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది.
Read Also: 14 Days Girl Friend Intlo movie:14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ రివ్యూ