14 Days Girl Friend Intlo movie:14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ రివ్యూ

14 Days Girl Friend Intlo movie:14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ రివ్యూ

థియేటర్లలో విడుదలైన ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ మూవీ,థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని కామెడీ మూవీ,మార్చి మొదటి వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో టీనేజ్ అమ్మాయిగా కనిపించిన శ్రియా కొంతం ఈ మూవీలో కథానాయికగా పరిచయమైంది. ఇందులో అంకిత్ కొయ్య హీరోగా నటించాడు. ఇందులో వెన్నెల కిషోర్, ఇంద్రజ ముఖ్యపాత్రలు పోషించగా శ్రీహర్ష మన్నే దర్శకత్వం వహించారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను ఈతరం యువత ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. మార్చి మొదటివారంలో థియేటర్లలో విడుదలైంది. కామెడీ బాగుందనే టాక్ వచ్చినప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది.

Advertisements

కథ

హర్ష(అంకిత్‌ కొయ్య) డైరెక్టర్‌ కావాలని కలలు కంటుంటాడు. క్రియేటివ్‌ కిసెస్‌(వెన్నెల కిశోర్‌) పెట్టిన యూట్యూబ్‌ ఛానెల్‌లో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. డేటింగ్‌ యాప్ ద్వారా ఆహాన(శ్రియ కొంతం)తో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరులవ్‌లో పడతారు. పేరెంట్స్ పెళ్లికి ఊరెళ్లడంతో ఒంటరిగా ఉన్న ఆహాన హర్షని ఇంటికి ఆహ్వానిస్తుంది.ఆహాన పిలిస్తే హర్ష ఇక ఆలోచించకుండా ఆమె ఇంటికి వెళ్తాడు. ఇద్దరు ఆ రోజు బాగా ఎంజాయ్‌ చేస్తారు.ఆ రోజు రాత్రి హర్ష ఆహాన ఇంట్లోనే ఉంటాడు. మార్నింగ్‌ వెళ్లిపోదామనుకునే సమయంలోనే సడెన్‌గా పేరెంట్స్ వస్తారు. పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందని వాళ్లు అనుకోకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. దీంతో హర్ష ఇంట్లోనే లాక్‌ అయిపోతాడు. వాళ్ల కంటపడకుండా మ్యానేజ్‌ చేస్తుంటారు. అంతలోనే కరోనా స్టార్ట్ అవుతుంది.దీంతో అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకున్న హర్ష ప్లాన్‌ బెడిసి కొడుతుంది.ఇక అధికారులు వీరి ఫ్యామిలీని ఐసోలేషన్‌ సెంటర్‌కి పంపిస్తారు. కానీ హర్ష ఇంట్లోనే ఇరుక్కుపోతాడు. దీంతో ఆ 14 రోజులు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్ని రోజులు ఎలా ఉన్నాడు? బయటకు వెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నాలేంటి? ఐసోలేషన్‌ పూర్తయ్యాక ఆహాన, హర్ష జీవితంలో చోటు చేసుకున్న షాకింగ్‌ ట్విస్ట్ ఏంటి? అనేది మిగిలిన కథ.

 14 Days Girl Friend Intlo movie:14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ రివ్యూ

లవర్‌ ఇంటికి వెళ్లిన కుర్రాడు ఆ ఇంట్లోనే ఇరుక్కుపోతే అన్ని రోజులు ఎలా ఉన్నాడు? ఎలా మ్యానేజ్‌ చేశాడు? బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు? ఈ క్రమంలో ఎలాంటి ఫన్నీ సన్నివేశాలు, ఎలాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయనేది సింపుల్‌గా ఈ మూవీ స్టోరీ ఫన్నీగా సాగుతుంది.రొమాంటిక్‌ టచ్‌తో ప్రారంభమై, కామెడీ సన్నివేశాలతో సాగుతూ, క్రమంగా ఉత్కంఠకు దారితీస్తూ, చివరికి సీరియస్‌గా మారి, ఎమోషనల్‌ సంఘటనలకు దారి తీస్తుంది.కథగా సింపుల్‌ స్టోరీ. కానీ దాన్ని ప్రజెంట్‌ చేసిన తీరు బాగుంది. ఈ జనరేషన్‌ని దృష్టిలో పెట్టుకుని యూత్‌కి కనెక్ట్ అయ్యేలా మూవీ ని తెరకెక్కించారు.

Read Also: Manchu Manoj : నటుడు మంచు మనోజ్‌ కారు చోరీ..పోలీసులకు ఫిర్యాదు

Related Posts
తండేల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్
తండేల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్

నాగ చైతన్యతో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం 'తండేల్' ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ప్రొమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ వివిధ Read more

Chinta Gopalakrishna Reddy;సినీ పరిశ్రమలో కష్టంతో పాటు గుర్తింపు ఉంది:
gopalakrishna reddy

నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి తన కొత్త చిత్రం 'క' ప్రమోషన్ల సందర్భంగా విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా, సుజీత్ మరియు Read more

రాంగోపాల్ వర్మ కు జైలు శిక్ష తప్పదు. కోర్టు ఆర్డర్.
రాంగోపాల్ వర్మ కు జైలు శిక్ష తప్పదు. కోర్టు ఆర్డర్.

టాలీవుడ్‌లో పాపులర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కోర్టు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘటన ఇప్పుడు అతనికి చిక్కడం జరిగింది. Read more

పుష్ప 2 తొక్కిసలాట: టాలీవుడ్ ఐక్యతపై ప్రశ్నలు
పుష్ప 2 తొక్కిసలాట: టాలీవుడ్ ఐక్యతపై ప్రశ్నలు

సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన ఓ అపశ్రుతి. ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని మొదట భావించినప్పటికీ, చివరికి పోలీసు కేసు వరకు వెళ్ళింది. ప్రస్తుతం ఈ కేసు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×