हिन्दी | Epaper

High Court: కేఏ పాల్ 5లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆజ్ఞ

Anusha
High Court: కేఏ పాల్ 5లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆజ్ఞ

ఏపీ హైకోర్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు షాకిచ్చింది,రూ.5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో సీబీఐ విచారణ కోరుతూ కేఏ పాల్ వేసిన పిల్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పిల్‌పై విచారణ జరిపే ముందు రూ.5 లక్షలు హైకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని కేఏ పాల్‌ను ఆదేశించింది. డబ్బులు కట్టిన తర్వాతే పిల్‌ను పరిశీలిస్తామని కోర్టు తేల్చి చెప్పింది.ఈ పిల్‌పై విచారణ వేసవి సెలవుల తర్వాత ఉంటుందని తెలిపింది.తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కేఏ పాల్ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిల బెంచ్ విచారణ చేస్తోంది. ఇప్పటికే కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. సీసీటీవీ ఫుటేజీ 3 నెలల్లో డిలీట్ అవుతుందని,కాబట్టి దానిని భద్రపరచాలని పోలీసులకు సూచించాలని కోరారు. ‘సీసీ ఫుటేజ్ డిలీట్ అవుతుందని మీకు ఎవరు చెప్పారు? వాస్తవాలు తెలియకుండా వాదనలు చేయొద్దు’ అని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఈ పిల్‌ను నిజాయితీగా వేశారని నిరూపించుకోవడానికి రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలని కేఏ పాల్‌కు ఏపీ హైకోర్టు ఆదేశించింది.

 High Court: కేఏ పాల్ 5లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆజ్ఞ

వాదనలు

ఈ పిల్‌పై ఇప్పటికే ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పగడాల మరణంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోర్టు ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్‌ డీఎస్పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. కేఏ పాల్ మాత్రమే కాదు,ప్రవీణ్ పగడాల కేసును సీబీఐకి అప్పగించాలని రాజమహేంద్రవరానికి చెందిన దాడి నాగేశ్వరరావు కూడా హైకోర్టులో మరో పిల్‌ వేశారు. అయితే కేఏ పాల్‌ ‘పార్టీ-ఇన్‌-పర్సన్‌’గా తన పిల్‌పై తానే వాదనలు వినిపిస్తున్నారు. పాస్టర్‌ ప్రవీణ్‌ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని,పోలీసులు కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని పాల్ ఆరోపిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి నెలలో రాజమహేంద్రవరం సమీపంలో మరణించిన సంగతి తెలిసిందే,అయితే అది రోడ్డు ప్రమాదమని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.ప్రవీణ్‌ మద్యం మత్తులో బైక్ నడిపారని ప్రమాదవశాత్తూ కిందపడి మరణించారన్నారు. అయితే కొందరు మాత్రం పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు,ఈ క్రమంలోనే కేఏ పాల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Read Also: Andhra Pradesh: అన్నదాత సుఖీభవకు కొత్త మార్గదర్శకాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870