हिन्दी | Epaper

Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు

sumalatha chinthakayala
Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు

Duvvada Srinivas : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైఎస్‌ఆర్‌సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే సస్పెండ్ చేసినట్టు సమాచారం. దువ్వాడ శ్రీనివాస్ గతేడాది నుంచి వార్తల్లో ఉంటున్నారు. దివ్వెల మాధురితో సాన్నిహిత్యం, పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు, ఇటీవల విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేసి బెదిరించడం వంటి అంశాలతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

జగనే నా దేవుడు అన్న దువ్వాడ దారెటో

పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే దువ్వాడను సస్పండ్ చేశారని తెలుస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత జగన్ ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జి పేరాడ తిలక్ కి మద్దతు తెలపమని జగన్ అడిగారు. కానీ దీనికి దువ్వాడ ఒప్పుకోలేదు. దీంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారని చెబుతున్నారు. నాయకుడు చెప్పిన వెంటనే సస్పెన్షన్ ను అమలు చేసింది పార్టీ కేంద్ర కమిటీ. దీంతో ఇప్పటి వరకు జగనే నా దేవుడు అన్న దువ్వాడ దారెటో అని పార్టీ జనాలు అనుకుంటున్నారు. ఇతని సస్పెన్షన్ తో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. కుటుంబ కలహాలే దువ్వాడకు శాపంగా పరిణించాయని..ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వాణి హాస్తం వుందని మాట్లాడుకుంటున్నారు.

Read Also: రాజ్‌ కెసిరెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870