Global Medcity in Amaravati..CM Chandrababu

CM Chandrababu : అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ : సీఎం చంద్రబాబు

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై సీఎం వివరాలు తెలిపారు. రాజధాని అమరావతి లో గ్లోబల్‌ మెడ్‌సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కుప్పంలో డిజిటల్‌ హెల్త్‌ నర్వ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. కొన్నిచోట్ల గుండెజబ్బులు, డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్‌టెన్షన్‌ అధికంగా కనిపిస్తోంది. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్‌ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉంది అని సీఎం వివరించారు.

Advertisements
అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ సీఎం

ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే చాలా

నలుగురు సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములనే తీసుకోవాలి. వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్లు మాత్రమే వినియోగించాలి. చక్కెర రోజుకు 25 గ్రాముల చొప్పున నెలకు 3 కిలోలు వాడితే సరిపోతుంది. ఇది సమతుల్యమైన డైట్‌గా గుర్తించి నియంత్రణ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే చాలా వరకు అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉండదు. చాలా వ్యాధుల నివారణ కోసం మంచి ఆహారపు అలవాట్లు పాటించాల్సిందే.

దానికి స్కోచ్ అవార్డు కూడా వచ్చింది.

రోజుకు కనీసం అరగంట పాటు తేలికపాటి వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాణాయామం చేయాలని కూడా పిలుపు ఇస్తున్నా. ప్రపంచం అంతా ఇప్పుడు ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తోంది. ఇటీవలే న్యూట్రిఫుల్ అనే యాప్ తయారు చేశాం. దానికి స్కోచ్ అవార్డు కూడా వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన యాప్ ఇది. దీన్ని ఇప్పటి వరకు 4 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు అని చంద్రబాబు తెలిపారు.

Read Also : ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్..!

Related Posts
TGMC దాడి: కాజీపేట, హన్మకొండలో నకిలీ వైద్యులపై కఠిన చర్యలు
medicine scaled

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) వారు, నవంబర్ 17, ఆదివారం, కాజీపేట మరియు హన్మకొండ జిల్లాల్లోని నకిలీ వైద్యులు క్లినిక్‌లపై రైడ్ నిర్వహించారు. ఈ రైడ్లలో మూడు Read more

జాక్ పాట్.. అంటే ఈ లారీ డ్రైవేరేదేపో..!!
Truck driver wins Rs 10 cro

పంజాబ్‌లోని రూప్ నగర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ హర్పిందర్ సింగ్ కు అదృష్టం తలుపుతట్టింది. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్-2025 లాటరీలో Read more

ఓమ్ని హాస్పిటల్‌లో దారుణం
kukatpally Omni Hospital

ఓమ్ని హాస్పిటల్‌ కూకట్‌పల్లిలోని ఓమ్ని హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరగా, Read more

Vijayasai Reddy : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్‌ నోటీసులు
SIT notices issued to former MP Vijayasai Reddy

Vijayasai Reddy : వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ లో జరిగిన అవకతవకలపై తాజాగా విచారణ కొనసాగుతోంది. పై టీడీపీ ఎంపీ ఏకంగా పార్లమెంట్ లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×