हिन्दी | Epaper

Ambati Arrest : అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

Sudheer
Ambati Arrest : అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో అంబటి సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసభ్య వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు, కూటమి శ్రేణులు భగ్గుమన్నాయి. గుంటూరు నవభారత్‌ నగర్‌లోని అంబటి ఇంటిని ముట్టడించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు 6 గంటలకుపైగా అందోళనకు దిగారు. ఇంటిపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. మహిళలు చెప్పులు, చీపుర్లతో నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్తలను బలంవంతంగా అక్కడి నుంచి పంపించేసిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తత మధ్య అంబటి రాంబాబును అరెస్ట్‌ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Phone Tapping Case : ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తండ్రిపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలపై తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహించిన విషయం తెలిసిందే. అంబటి రాంబాబు బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలంటూ అతని ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

గుంటూరులో ఉన్న నవభారతనగర్‌లోని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తండ్రిపై అంబటి అసభ్య వ్యాఖ్యలు చేశారు. మురికి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు, ప్రజలు ఆగ్రహించారు. అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీడీపీ శ్రేణులు ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంట్లోని కిటికీ అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. ఇంటివద్ద ఉన్న అంబటి వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన దిగారు. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలని మాధవి డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పోలవరం పనుల కోసం నిధులు విడుదల!

పోలవరం పనుల కోసం నిధులు విడుదల!

ఏలూరులో ఘోరం: భార్య గొంతు కోసి పరారైన కిరాతక భర్త!

ఏలూరులో ఘోరం: భార్య గొంతు కోసి పరారైన కిరాతక భర్త!

తిరుమలలో కట్టెల పొయ్యిపై వంటలు

తిరుమలలో కట్టెల పొయ్యిపై వంటలు

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

పుంగనూరులో విషాదం: బైక్ పొగతో ఊపిరాడక నలుగురు మృతి

పుంగనూరులో విషాదం: బైక్ పొగతో ఊపిరాడక నలుగురు మృతి

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

📢 For Advertisement Booking: 98481 12870