తెలుగు సాహిత్య చరిత్రలో శతకాలు ఒక ప్రత్యేకమైన, విలువైన స్థానం కలిగి ఉన్నాయి. నైతిక బోధ, జీవిత సత్యాల ఆవిష్కరణ, సామాజిక విమర్శ, భక్తి భావంఇవన్నీ సులభమైన ఛందస్సులో, సామాన్యుడికి చేరువగా చెప్పిన సాహిత్య రూపమే శతక పద్యాలు. వేమన, సుమతి, భాస్కర శతకం, దాశరథి శతకం వంటి రచనలు తరతరాలుగా ప్రజల నోట నానుతూ, వారి ఆలోచనలను తీర్చిదిద్దాయి. అయితే ఆధునిక యుగంలోకి అడుగుపెట్టిన తర్వాత శతక పద్యాలకు ఆదరణ క్రమంగా తగ్గిపోతోందన్న వాస్తవం ఆందోళన కలిగించేది. డిజిటల్ (digital sounds)యుగం మన చదువు అల వాట్లను పూర్తిగా మార్చేసింది. క్షణాల్లో సమాచారం కావా లన్న ఆత్రుత, చిన్న వీడియోలు, రీల్స్, సోషల్ మీడియా పోస్టుల మాయలో పడి మనసు లోతైన పఠనానికి దూర మవుతోంది. శతక పద్యం చదవాలంటే ఓర్పు, ఆలోచన, అంతర్ముఖత అవసరం. కానీ ఆధునిక మనిషి జీవితంలో ఇవన్నీ అరుదైపోయాయి. త్వరగా చదివి, వెంటనే మరిచిపోవాలి. అన్నధోరణి పెరుగుతున్న కొద్దీ శతకాల వంటి సాంప్ర దాయ సాహిత్యానికి స్థానం తగ్గుతోంది. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు కూడా ఈ పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు. ఒకప్పుడు పాఠశాలల్లో శతక పద్యాలు పాఠ్యాంశా లుగా ఉండేవి, విద్యార్థులు వాటిని కంఠస్థం చేసి, వాటి భావాన్ని చర్చించేవారు. నేడు పరీక్షా కేంద్రిత విద్య, మార్కు ల పోటీ, ఇంగ్లీష్ మాధ్యమ ప్రాధాన్యం కారణంగా మాతృ భాషా సాహిత్యానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. ఫలి తంగా శతకపద్యాలు యువతకు పాతకాలం వాటిగా మాత్రమే కనిపిస్తున్నాయి. అదే సమయంలో, ఆధునిక సాహిత్య రూపాలు స్వేచ్ఛా ఛందస్సు కవిత్వం, నవలలు, కథలు ప్రస్తుత జీవన సమస్యలను నేరుగా ప్రతిబింబిస్తున్నాయన్న భావన బలపడింది.
Read Also : RBI: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు ఎన్ని సెలవులు?

శతకాలు ఎక్కువగా నైతికబోధ, ఆధ్యా త్మికత చుట్టూ తిరుగుతాయన్న అపోహ కూడా ఉంది. కానీ వాస్తవానికి వేమన శతకం వంటి రచనలు సమాజంలోని మూఢాచారాలను, అసమానతలను తీవ్రంగా ప్రశ్నించాయి. ఈ కోణాన్ని మనం సరిగ్గా ఆవిష్కరించకపోవడమే శతకాల పట్ల ఆసక్తి తగ్గడానికి ఒక కారణం. మరో ముఖ్యమైన అంశం ప్రచారం లోపించడం. ఆధునిక సాహిత్యానికి వేదికలు, సాహిత్య సమావేశాలు, మీడియా చర్చలు లభిస్తున్నాయి. కానీ శతకాలపై సమకాలీన చర్చలు చాలా అరుదు. టెలివిజన్, డిజిటల్ (digital sounds)మాధ్యమాల్లో శతకాలను ఆధునిక సందర్భాలకు అన్వయిస్తూ ప్రజలకు చేరవేయగలిగితే, వాటి విలువ మరిం త స్పష్టమవుతుంది. పాతదాన్ని పాతగా కాకుండా, నేటి జీవితానికి అర్థవంతంగా చూపించడంలోనే అసలు సవాలు ఉంది. అయితే ఈ తగ్గుతున్న ఆదరణను పూర్తిగా నిరాశగా చూడాల్సిన అవసరం లేదు. శతకపద్యాల్లో ఉన్న సంక్షిప్తత, గాఢమైన భావం నేటి కాలానికే మరింత అవసరం. ఒకే పద్యంలో జీవనతత్వాన్ని చెప్పగల సామర్థ్యం శతకాలకు ఉంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఆడియో శతకాలు, వీడియో వివరణలు, సోషల్ మీడియా కోట్స్ రూపంలో వాటిని పరిచయంచేస్తే యువతలో ఆసక్తి మళ్లీ చిగురించ వచ్చు. విద్యాసంస్థలు కూడా శతకాలను కేవలం పాఠ్యాంశం గాకాకుండా, జీవిత విలువల బోధనగా పరిచయం చేయాల్సి న అవసరంఉంది. ముగింపుగా చెప్పాలంటే, ఆధునిక యుగం లో శతకపద్యాలకు తగ్గుతున్న ఆదరణఅనేది కాలప్రవాహం లో వచ్చిన మార్పుల ప్రతిబింబమేకానీ, శతకాల విలువ తగ్గినట్టు కాదు. వాటిని చదివే విధానం, పరిచయం చేసేతీరులో మార్పురావాలి. తెలుగు సాహిత్యానికి పునాదైన ఈశతక సం ప్రదాయాన్ని నిర్లక్ష్యంచేయడమంటే మన సాంస్కృతిక మూ లాలను విస్మరించినట్టే. ఆధునికతతో పాటుసంప్రదాయానికి సమతుల్యం సాధించినప్పుడే సాహిత్యం నిజమైన అర్థం.
-తిప్పర్తి శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :