ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని CM రేవంత్ పోలీసులను ఆదేశించారు. ‘కొందరు అభ్యర్థులు భావోద్వేగంలో ఉన్నారు. వాళ్లపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లపై కేసులు పెడితే పోటీ పరీక్షల్లో రాణించినా ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. వీళ్లు గ్రూప్-1 పరీక్షల్లో పాసైతే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతారు. అభ్యర్థులపై మానవత్వంతో వ్యవహరించండి’ అని పోలీసులకు సూచించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘పరీక్షలకు సిద్ధం కండి. 95శాతం మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మరో 5శాతం మంది డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకండి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేం వచ్చాకే వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.