हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Andhra Pradesh: కాణిపాకం ఆలయంలో 8 మంది ఉద్యోగులు తొలగింపు ఎందుకంటే?

Anusha
Andhra Pradesh: కాణిపాకం ఆలయంలో 8 మంది ఉద్యోగులు తొలగింపు ఎందుకంటే?

ఏపీలోని కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో ఎనిమిది మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పిస్తూ,దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాణిపాకం ఆలయంలో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు, తాత్కాలిక బ్యాంకు ఉద్యోగులను ఎనిమిది మందిని విధుల నుంచి తప్పించింది. ఎనిమిది మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని ఏపీ దేవాదాయశాఖ కార్యదర్శి వి.వినయ్‌చంద్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.అయితే 2021 సంవత్సరంలో ఏసీబీ అధికారులు కాణిపాకం ఆలయం వద్ద ఉన్న ముఖ్యమైన ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. టికెట్లు, విరాళాల స్వీకరణ కేంద్రాలు, లడ్డూ పోటు వంటి ప్రాంతాల్లో 2021 ఫిబ్రవరి ఆరో తేదీన ఏసీబీ అధికారులు తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో కొంతమంది ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా(Careless in duties)ఉండటంతో పాటుగా, అధికంగా నగదు ఉంచుకోవడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో తాత్కాలిక బ్యాంకు ఉద్యోగులు జి.సురేష్, బి.కరుణాకర్, కె.తేజేష్, ఆలయ ఒప్పంద, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎ.చిదంబరం, వి.కనరాజులు, కె.హరిబాబు, ఎస్‌.పృథ్వీరాజ్, జె.బాలకృష్ణను విధుల నుంచి వెంటనే తొలగించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఆలయం

చిత్తూరు జిల్లాలో బాహుదా నది ఒడ్డున కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం కొలువై ఉంది. కాణిపాకం ఆలయంలో గణేశుడు స్వయంభువుగా వెలిసి పూజలు అందుకుంటున్నాడు. కాణిపాకం ఆలయం చిత్తూరు నుంచి 11 కి.మీ., తిరుపతి నుంచి 68 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకం ఆలయాన్ని(Kanipakam Temple) 11వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించగా, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు ఆ తర్వాతి కాలంలో అభివృద్ధి చేసినట్లు చరిత్ర చెప్తోంది. కాణిపాకం ఆలయం సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి. కాణిపాకం ఆలయం చేరుకోవటానికి చిత్తూరు, తిరుపతి నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

 Andhra Pradesh: కాణిపాకం ఆలయంలో 8 మంది ఉద్యోగులు తొలగింపు ఎందుకంటే?
Andhra Pradesh: కాణిపాకం ఆలయం

అధికారులు

మరోవైపు తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. గంగమ్మ జాతరలో భాగంగా మూడోరోజైన గురువారం బండ వేషధారణలతో భక్తులు సందడి చేశారు. బండ వేషధారణ అంటే శరీరమంతా ఎర్రని కుంకుమ పూసుకుని నల్లటి, తెల్లటి చుక్కలు పెట్టుకుని చేతులతో వేపమండలతో ,ఈ వేషధారణతో తిరుపతి గంగమ్మ ఆలయానికి చేరుకుని ఆలయం వద్ద అమ్మవారి పాదాల ముందు ఉప్పు, మిరియాలు పోసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక జాతరలో భాగంగా శుక్రవారం వేషాలతో అలరించారు. మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో గంగమ్మ ఆలయంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: Andhra Pradesh: యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ కి చంద్రబాబు,లోకేష్ నివాళి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870