విజయవాడ :బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని వాయుగుండం బలహీనపడింది. సాయంత్రం శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు(Weather Update) సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ముల్లయిట్టివుకు 30 కిలోమీటర్లు, జాఫ్నా (శ్రీలంక)కు 70కి.మీ, మన్నార్ (శ్రీలంక)కు 90 కి.మీ, కరైకల్ (పుదుచ్చేరి)కి 190 కి.మీ, చెన్నైకు 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఆదివారం ఉదయంలోగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Read also: Telugu States: పెరుగుతున్న చలి.. వణుకుతున్న జనం

దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోఇదిలా(Weather Update) ఉండగా మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. తొలుత ఇది తుపానుగా బలపడుతుందని ఐఎండీ తొలుత అంచనా వేసినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు చెప్పారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంకలో ట్రింకోమలి, జాఫ్నా మధ్యలో శనివారం మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: