BRS : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకు వచ్చారో మేము కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టినవి తిరిగి తీసుకు రావడానికి కోబ్రా అని తీసుకువస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం నుంచి మొదలుకొని వారి కుటుంబ సభ్యుల వరకు భూములు అగ్రిమెంట్ చేసుకుంటూ కబ్జాలు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి
మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే హైవే రోడ్డు మీద పడ్డ మందు లారీ లెక్క అయిందని విమర్శించారు. ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకొని పోదాం అనే తప్ప పార్టీని బతికిద్దాం అని ఎవరికీ లేదన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్‌ఫ్లాప్ అయ్యిందన్నారు. కాళేశ్వరం మీద సీఎం రేవంత్ కక్షకట్టారని బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. ప్రజల గుండెల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు తిరగబడేరోజు వస్తుందని బాల్క సుమన్ అన్నారు.
Read Also: జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం