హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.అయితే, హైడ్రా చర్యల కారణంగా కొందరు నిరుపేదలు సైతం రోడ్డున పడుతున్నారు.తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపివేయాలని కోర్టుకు విన్నవించారు. జీఓ నంబర్ 99పై స్టే విధించాలని కేఏ…