ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం ఐఎస్ఐఎస్ ఉగ్రమూలాల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సిరాజ్, సమీర్‌లను పోలీసులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సిరాజ్‌కు ఒక అజ్ఞాత వ్యక్తి ప్రోత్సాహం అందించినట్లు తేలింది. అలాగే, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్(Siraj) చేసిన వ్యాఖ్యలకు ఆ వ్యక్తి స్పందించి, ప్రశంసించాడు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అని పోలీసులు కూపీలాగుతున్నారు. విజయనగరం పోలీసు ట్రెయినింగ్ అకాడమీ(Police Training Academy)లో శనివారం 7 గంటల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో అనేక విషయాలు తెలిశాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్ సామాజిక మాధ్యమాల్లో స్పందించాడు. దీనిని ఒక అజ్ఞాత వ్యక్తి గుర్తించాడు.
పోలీసులు
సిరాజ్‌ను మెచ్చుకుంటూ అతడికి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత వారి మధ్య చాటింగ్ మొదలైంది. కొంతకాలానికి ఆ వ్యక్తి తన వివరాలు సిరాజ్‌కు చెప్పాడు. తాను విశాఖకు చెందిన రెవెన్యూ అధికారి(Revenue Officer) అని పరిచయం చేసుకున్నాడు. ఒక వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్‌ను ప్రోత్సహించాడు.ఆ వ్యక్తి గురించి సిరాజ్ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.ఆ వ్యక్తిసిరాజ్‌ను ఎందుకు ప్రోత్సహించాడు? అతడి ఉద్దేశం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. తనను ప్రశంసిస్తూ అతడి నుంచి మెసేజ్ వచ్చిందని సిరాజ్ పేర్కొన్నాడు. స్వయంగా అతడు ఫోన్ చేసి అభినందించినట్టు తెలిపాడు. ఇక, ఈ కేసులో మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో బయటపడనున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఈ ఉగ్రకుట్ర వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

స్థాపించినట్టు
మరోవైపు, ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సిరాజ్, సమీర్‌లు మరో నలుగురితో కలిసి సోషల్ మీడియా(Social media)లో ఒక రహస్య గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని చాటింగ్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఈ సిరాజ్, సమీర్ కలిసి అల్‌హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను స్థాపించినట్టు తెలిసింది. ఈ ఆరుగురు యువకులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువకులుగా పోలీసులు తేల్చారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఈ విషయాలను పోలీసులు పేర్కొన్నారు.
Read Also: IPL 2025: ముంబై ఇండియన్స్‌కు అద్భుత అవకాశం