हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Virat Kohli: అయోధ్యలో హనుమంతుడిని దర్శించుకున్న కోహ్లీ దంపతులు

Anusha
Virat Kohli: అయోధ్యలో హనుమంతుడిని దర్శించుకున్న కోహ్లీ దంపతులు

టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. తన సతీమణితో కలిసి పలు క్షేత్రాలను సందర్శిస్తున్నాడు.ఈ నేపథ్యం లోనే.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అయోధ్యలోని ప్రముఖ హనుమాన్ గర్హి దేవాలయాన్ని ఆదివారం సందర్శించారు. ఆలయ పూజారులు కోహ్లీ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ(Virat Kohli, Anushka Sharmaలు హనుమంతుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. పూజారులు వారిని పూలమాలలతో సత్కరించారు. వారి నుదుటన తిలకం దిద్ది స్వామివారి చిత్రపటాలను అందజేశారు. విరాట్ దంపతులను చూసిన అభిమానులు అక్కడ గుమిగూడారు. విరాట్, అనుష్క చుట్టూ భారీ జనసమూహం ఉంది.వారిద్దరూ హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవల విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ప్రేమానంద మహరాజ్‌ను కలవడానికి కూడా వెళ్లారు.

రిటైర్మెంట్

విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేశాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో భారత్ తరఫున 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీ‌లు ఉన్నాయి. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కోహ్లీ టీ20 ఫార్మాట్ నుంచి కూడా రిటైర్ అయ్యాడు.విరాట్ కోహ్లీ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ 13 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే తమ చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో గెలిస్తే వారు టాప్-2లో కూడా స్థానం సంపాదించవచ్చు. ఫైనల్‌కు చేరుకోవడానికి వారికి రెండు అవకాశాలు లభిస్తాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 7 హాఫ్ సెంచరీలతో 548 పరుగులు చేశాడు.

Read Also : IPL 2025: ముంబై ఇండియన్స్‌కు అద్భుత అవకాశం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870