Vijaya Shanthi: ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌పై ట్రోల్స్ స్పందించిన విజ‌య‌శాంతి

Vijaya Shanthi: ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌పై ట్రోల్స్ స్పందించిన విజ‌య‌శాంతి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా భయటపడడంతో భారత్ వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు సైతం సమర్పించుకుంది. క్రిస్టియన్ అయినా అన్నా లెజినోవా ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి హిందూ సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ శ్రీవారికి మొక్కు చెల్లించుకుంది. అనంతరం నిత్యాన్నాదనం కోసం రూ.17 లక్షలు విరాళం అందచేసింది. అంతేకాకుండా భక్తులతో కలిసి నిత్యాన్నాదనంలో పాల్గొంది. విదేశాల్లో పుట్టిపెరిగిన అన్నా లెజినోవా.. భారత్ కు వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరించడంపై ఆమెపై ప్రశంసలు వచ్చాయి. కొడుకు కోసం అన్నా లెజినోవా చేసిన మంచి పనిని చాలా మంది పొగిడారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం అన్నా లెజినోవా తీరుపై నెట్టింట ట్రోల్స్ చేశారు.

Advertisements

కృతజ్ఞత

తన ట్విట్టర్ ఖాతాలో అన్నా లెజినోవాపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. హరహర మహాదేవ్, జై తెలంగాణ” అంటూ ట్విట్టర్ ఖాతాలో రాసుకోచ్చారు విజయశాంతి.

స‌పోర్ట్

అనుకోకుండా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌ని విమ‌ర్శిస్తున్న సమ‌యంలో తోటి మ‌హిళ‌గా విజ‌య‌శాంతి ముందుకు వ‌చ్చి స‌పోర్ట్ చేయ‌డం చాలా గొప్ప ప‌రిణామం అంటూ ఆమెని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక విజ‌య‌శాంతి న‌టించిన అర్జున్ స‌న్ ఆఫ్ విజ‌య‌శాంతి చిత్రం ఏప్రిల్ 18న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

Read Also: Election Commission : ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

Related Posts
L2E: Empuraan Review : ‘ఎల్‌-2 ఎంపురన్‌’ మూవీ రివ్యూ
L2E Empuraan Review 'ఎల్‌ 2 ఎంపురన్‌' మూవీ రివ్యూ

L2E: Empuraan Review : 'ఎల్‌-2 ఎంపురన్‌' మూవీ రివ్యూ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘లూసిఫర్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిత్రానికి Read more

తల్లికి వందనం పథకంపై నారా లోకేష్ కీలక ప్రకటన
talliki vandanam

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ త్వరలోనే అమలు కానున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లికి వందనం పథకం కింద Read more

AndhraPradesh: కొడాలి నానికి గుండెపోటు ఆస్పత్రికి తరలింపు
కొడాలి నానికి గుండెపోటు ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన, ఛాతీ నొప్పితో బాధపడుతూ హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ Read more

నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు..ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు..ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు.. ఏపీ కేబినెట్ భేటీ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం రాష్ట్ర 2024-25 Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×