
Subedaar: అనిల్ కపూర్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ డ్రామా ‘సుబేదార్’. సురేశ్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నేరుగా ‘అమెజాన్ ప్రైమ్’ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. మార్చి 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
Read Also: Ustaad Bhagat Singh Movie: ఉగాది కానుకగా ఉస్తాద్ రిలీజ్
కథ
సుబేదార్ అర్జున్ మౌర్య (అనిల్ కపూర్) పదవీ విరమణ అనంతరం తిరిగొస్తాడు. మూడు నెలల క్రితమే ఆయన భార్య సుధా మౌర్య (ఖుష్బూ) చనిపోతుంది. కూతురు శ్యామా (రాధిక మదన్) అక్కడి డిగ్రీ కాలేజ్ లో చదువుతూ ఉంటుంది. చనిపోవడానికి ముందు తన భర్తకి కానుకగా ఇవ్వడం కోసం సుధ ఒక ‘జిప్సీ’ని బుక్ చేస్తుంది. పచ్చళ్ల బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బుతో భార్య తీసుకున్న ఆ జిప్సీ అంటే, సుబేదార్ కి ఎంతో అపురూపం.
సుబేదార్ ఆ ఊరుకు వచ్చేసరికి అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ‘బబ్లీ దీదీ’ (మోనా సింగ్) జైలుకు వెళ్లడంతో, ఆమె కనుసన్నలలో తమ్ముడు ప్రిన్స్ (ఆదిత్య రావల్) ఆమె ప్రధానమైన అనుచరుడు సాఫ్టీ (ఫైజల్) ఇసుక మాఫియాను నడిపిస్తూ ఉంటారు. నదిలో ఇసుకను అక్రమంగా తవ్వుతూ ఉండటం వలన, ఆ ఏడాదిలో 15 మంది పిల్లలు ఆ గోతులలో పడి చనిపోతారు. ఈ విషయాన్ని మీడియాకి చెప్పడానికి ప్రయత్నించిన వాళ్లను కూడా ప్రిన్స్ చంపేస్తూ ఉంటాడు.
పార్కింగ్ విషయంలో ప్రిన్స్ కీ సుబేదార్ కి మొదలైన గొడవ పెరుగుతూ వెళుతుంటుంది. బబ్లీ దీదీ జైలు నుంచి బయటికి రావాలంటే, ఆ కేసులో కీలక ఆధారమైన ‘గన్’ ఒకటి దొరకాలి. ఆ గన్ సుబేదార్ దగ్గర ఉంటుంది. దాని కోసం అతణ్ణి ప్రిన్స్ టార్గెట్ చేస్తాడు. ఇక కాలేజ్ లో ‘రణ్ వీర్’ అనే రౌడీ స్టూడెంట్, తనకి సంబంధించిన ఒక వీడియో కోసం సుబేదార్ కూతురు శ్యామాను టార్గెట్ చేస్తాడు. ఈ ప్రమాదాల నుంచి తండ్రీ కూతుళ్లు ఎలా బయటపడతారు? అనేది కథ.
స్క్రీన్ ప్లే
కథ – స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలమని చెప్పాలి. ఎక్కడా లూజ్ సీన్స్ లేకుండా చేసిన ఆవిష్కరణ ఆకట్టుకుంటుంది. అజయ్ సక్సేనా ఫొటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం కథలో నుంచి జారిపోనీయకుండా అలా సన్నివేశాల వెంట పరిగెత్తిస్తుంది. శివ్ కుమార్ పణికర్ ఎడిటింగ్ పనితీరు సంతృప్తికరంగా అనిపిస్తుంది. యాక్షన్ ఎమోషన్ తో ముడిపడిన ఈ కథ, మొదటి నుంచి చివరివరకూ అలా కూర్చోబెట్టేస్తుంది. అక్కడక్కడా సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు, ‘జైలర్’ సినిమాను గుర్తుచేస్తుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: