ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు భక్తులతో వెళ్తోన్న హెలికాప్టర్ కూప్పకూలింది. గుప్తకాశీ సమీపంలో గౌరీకుండ్ అడవుల్లో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌లో ఆరుగురు భక్తులు, పైలట్ ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ కారణంగానే హెలికాప్టర్ కూలినట్టు భావిస్తున్నారు.ఆ హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారని తెలిపారు. సాంకేతికలోపం కారణంగానే ప్రమాదం జరిగిందని, క్రాష్ ల్యాండింగ్ అయ్యిందని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం ఆర్యన్ ఏవియేషన్ కంపెనీ హెలికాప్టర్ 5.20 నిమిషాలకు కేదార్నాథ్ నుంచి భక్తులతో గుప్తకాశీ వెళ్తున్న క్రమంలో ఘటన జరిగింది. ఈ మేరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాలకే హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో పైలట్,తో పాటు హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులతో సహా అన్ని రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి.
హెలికాప్టర్
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘రుద్రప్రయాగ్ జిల్లా (Rudraprayag district) లో హెలికాప్టర్ కూలిన విషయం, అత్యంత విచారకరమైన వార్త అని తెలిపారు. SDRF, స్థానిక పరిపాలన, ఇతర రక్షణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రయాణికులందరు సురక్షితంగా ఉండాలని ఆ కేదార్‌నాథుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
Read Also: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం..లండన్‌లో బేబీ షవర్ కోసం వెళ్తూ 3 కుటుంబ సభ్యులు మృతి