సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. సోమవారం రష్యాతోనూ చర్చలు జరుగుతాయి. ఉక్రెయిన్‌లో సమగ్ర శాంతి ఒప్పందానికి ముందు, తక్షణ పాక్షిక కాల్పుల విరమణ అమల్లోకి తేవాలని వాషింగ్టన్ భావిస్తోంది. అందుకే రియాద్ చర్చల్లో ఈ అంశం ఏదైనా ఓ కొలిక్కి వస్తుందా లేదా అని అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయితే అది ఎవరు ఎవరి మాట వింటారనే దానిపై ఆధారపడి ఉంది. “పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని భావిస్తున్నాను ” అని అమెరికా అధ్యక్షుడి తరపు దూత స్టీవ్ విట్‌కాఫ్ అన్నారు. “మీరు సోమవారం రియాద్‌లో జరిగే చర్చల్లో అసలైన పురోగతి చూస్తారు” అని ఆయన అన్నారు.

మనం ఈ మార్గంలోకి ఇప్పుడే అడుగు పెట్టాం
అయితే రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ అంచనాలను కొట్టి పారేశారు. “మనం ఈ మార్గంలోకి ఇప్పుడే అడుగు పెట్టాం” అని ఆయన రష్యా అధికార టెలివిజన్ చానల్‌తో చెప్పారు. శనివారం రాత్రి రష్యా కీయెవ్ మీద డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు చనిపోయారు. “దాడులు ఆపాలని పుతిన్ నిజమైన ఆదేశాలు జారీ చేసేలా ఆయనపై మేం ఒత్తిడి తేవాల్సి ఉంది.
రష్యా మీద ఆంక్షలను సడలిస్తే..
రష్యా మీద ఆంక్షలను సడలిస్తే, యుక్రెయిన్ పోర్టుల నుంచి నల్ల సముద్రం మీదుగా ఎగుమతి అయ్యే గోధుమ నౌకలపై రష్యా దాడులు చేయకుండా ఉండే ఒప్పందాన్ని పునరుద్దరించవచ్చని భావిస్తున్నారు. యుద్ధంలో భాగంగా రష్యా, యుక్రెయిన్ తమ ప్రత్యర్థుల మౌలిక వసతుల మీద దాడులు చేశాయి. యుక్రెయిన్ విద్యుదుత్పత్తి కేంద్రాల మీద దాడులు చేయడం ద్వారా ఆ దేశ ప్రజలు చీకటి, చలితో బాధ పడేలా రష్యా దాడులు చేసింది.