Kishan Reddy on a hasty visit to Delhi

Kishan Reddy : హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు కిషన్‌రెడ్డి

Kishan Reddy : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం సికింద్రాబాద్‌లో సాయంత్రం జరిగే బిహార్‌ దివస్‌లో ఆయన పాల్గొనాల్సి ఉండగా.. దాన్ని రద్దు చేసుకొని హస్తినకు వెళ్లారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న క్రమంలో ఉన్నపళంగా ఆయన ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ విధంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకొని కిషన్ వెళ్లి ఉంటారనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఆ కీలక అంశం ఏమిటి ? తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక విషయమా ? బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో కిషన్ రెడ్డి ఉన్న విషయమా ? వక్ఫ్ బిల్లు విషయమా ? దక్షిణాది రాష్ట్రాలను కుదిపేస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశమా ? అనేది తెలియాల్సి ఉంది.

Advertisements
హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు కిషన్‌రెడ్డి

ఆయా అంశాలపై చర్చించేందుకు

ఇక, ఇతరత్రా కారణాలతోనూ ఢిల్లీకి కిషన్ రెడ్డి వెళ్లి ఉండొచ్చు. నేటి(సోమవారం) నుంచి కీలకమైన పార్లమెంటు సెషన్ జరగబోతోంది. ఇందులో వక్ఫ్ సహా పలు అంశాలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రాధాన్యమున్న బిల్లులపై ఓటింగ్, చర్చ వంటివి ఉన్నప్పుడు తప్పకుండా కేంద్ర మంత్రులు పార్లమెంటులో అందుబాటులో ఉండాలి. ఆయా అంశాలపై చర్చించేందుకు మంత్రి మండలి సమావేశాలు సైతం జరుగుతుంటాయి. వివిధ అంశాలపై లోక్‌సభ‌లోని విపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బహుశా అందుకే కిషన్ రెడ్డి ఢిల్లీకి హుటాహుటిన వెళ్లి ఉంటారని కొందరు అంటున్నారు.

Related Posts
నేడు సూర్యాపేటలో పర్యటించనున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
Governor Jishnu Dev Varma will visit Suryapet today

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడురోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం సూర్యాపేట జిల్లాలో సందర్శనకు వెళ్లనున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశానికి Read more

జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ కాదు ఫ్యామిలీ దావత్‌ – కేటీఆర్
KTRs brother in law Raj Pa

ఆదివారం ఉదయం నుండి జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ పై పెద్ద ఎత్తున ఆరోపణలు , ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ బావమరిది Read more

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: గిరిజ‌నుల‌కు సీఎం సూచ‌న‌
Don't believe false propaganda.. CM advises tribals

గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ చంద్ర‌బాబు ట్వీట్‌ అమరావతి: గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వారి Read more

దేశంలో కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణ!
దేశంలో కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణ!

దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ తగ్గుతోందని ఓ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్‌.. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×