10 dead after fruit and veg

కర్ణాటకలో మరో ఘోర ప్రమాదం..10 మంది మృతి

కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై ఒక కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ట్రక్కు 50 మీటర్ల లోయలో పడటంతో ప్రమాద స్థాయి ఎక్కువైంది.

Advertisements


సావనూర్ నుంచి యల్లాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన మరో 10 మందిని వెంటనే హుబ్బళ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతులు సవనూరు తాలూకాకు చెందినవారని, లారీలో మొత్తం 28 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

మృతులను ఫయాజ్ ఇమామ్ సాబ్ జమఖండి (45), వసీం వీరుల్లా ముదగేరి (35), ఇజాజ్ ముస్తాకా ముల్లా (20), సాదిక్ భాష్ ఫరాష్ (30), గులాముషేన్ జవలి (40), ఇంతియాజ్ మమజాపర్ ములకేరి (36), అల్పాజ్ జాఫర్‌లుగా గుర్తించారు. మందక్కి (25), జీలానీ అబ్దుల్ జఖాతి (25) అస్లాం బాబులీ బట్టర్ (24)గా గుర్తించారు.

అంతకు ముందు కూడా రాష్ట్రంలో మరో ప్రమాదం ఈరోజు ఉదయం జరుగగా..ఈ ప్రమాదంలో ఐదు మందిపైన చనిపోయారు. ప్రమాదంలో మృతిచెందిన వారింతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకున్నారు. పునరావృతమైన ప్రమాదాల నేపథ్యంలో రోడ్డు సంబంధిత చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు మరియు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి పలు చర్యలు తీసుకోవాలని ప్రజలు, అధికారుల వంతు నుండి గట్టి విజ్ఞప్తులు వ్యక్తం అవుతున్నాయి.

Related Posts
భవిష్యత్తులో 3.5 రోజుల పని వారాలు: AI ద్వారా పని సమయం తగ్గుతుందా?
ai

జేపీమోర్గాన్ సీఈఓ జేమీ డైమన్, భవిష్యత్ తరగతుల కోసం వారానికి 3.5 రోజుల పని వారాలను అంచనా వేస్తున్నారు. ఆయన అనుసరించిన అభిప్రాయం ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Read more

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు

వికారాబాద్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలానికి చెందిన 30 మంది కార్యకర్తలు బుధవారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో Read more

రాజమౌళి-మహేష్ సినిమాకు ప్రియాంక చోప్రా?
రాజమౌళి-మహేష్ సినిమాకు ప్రియాంక చోప్రా?

మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న జంగిల్ అడ్వెంచర్ చిత్రం గురించి తాజా పుకార్లు పుట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా విడుదల Read more

Chandrababu: రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమి పర్వదినం, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆధ్యాత్మికంగా, ఉత్సాహంగా, జరుపుకుంటారు. ప్రతి నగరం, పట్టణం, గ్రామం సైతం రామనామ స్మరణలతో మార్మోగుతూ, Read more

×