2021 నవంబర్‌లో జరిగిన లైంగిక వేధింపుల కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలువ్యక్తమవుతున్నాయి. మహిళల భద్రత, లైంగిక హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇది అనుకూలమైన తీర్పు కాదని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి మండిపడ్డారు.ఈ తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
వివాదాస్పద తీర్పు
ఒక మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్య,ఈ తీర్పుపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తీవ్ర అసంతృప్తి,ఇలాంటి తీర్పులు సమాజంలో తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని ఆందోళన.
కేసు నమోదు
ఉత్తర ప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతం లో ఒక మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని వెంటాడారు.బాలికను ఇంటి వద్ద దింపుతామని నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.మార్గమధ్యలో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటానికి ప్రయత్నించారు.అసభ్యంగా తాకుతూ వేధించగా, బాలిక భయంతో అరిచింది.అటుగా వెళుతున్న స్థానికులు గమనించడంతో నిందితులు పారిపోయారు.ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది.

అలహాబాద్ హైకోర్టు
ఈ కేసు విచారణ హైకోర్టుకు వెళ్లగా, న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా ఇచ్చిన తీర్పు ఆశ్చర్యం కలిగించింది. ఒక మహిళ ఛాతిని తాకడం అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.దీంతో నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించబడిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు .ఈ తీర్పుపై మహిళా సంఘాలు, సామాజిక వేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందన
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ తీర్పును తీవ్రంగా ఖండించారు.ఇలాంటి తీర్పులు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.మహిళల భద్రతకు కఠినమైన చట్టాలు ఉండాలి.ఇలాంటి తీర్పులు మహిళా హక్కులను దెబ్బతీసే ప్రమాదం ఉంది.న్యాయవ్యవస్థ బాధితుల పక్షాన నిలబడేలా ఉండాలి.