David Warner: నేడు హైదరాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ : ‘రాబిన్ హుడ్‘ ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ సినిమాలో నటించడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ చిత్రంలో వార్నర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అతని పాత్రకు ‘డేవిడ్’ అనే పేరును పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా, ‘రాబిన్ హుడ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి వార్నర్ నేడు హైదరాబాద్ చేరుకున్నాడు. విమానాశ్రయంలో చిత్ర బృందం అతనికి ఘన స్వాగతం పలికింది. వార్నర్‌ను చూసేందుకు, అతనితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూశారు. ఈ సాయంత్రం హైదరాబాద్‌లోనే ఈ వేడుక గ్రాండ్‌గా జరగనుంది.వార్నర్‌ను ఈ చిత్రంలో భాగం చేయడం వెనుక దర్శకుడు వెంకీ కుడుముల ప్రత్యేక ఆలోచన ఉందని హీరో నితిన్ తెలిపారు. సినిమా ప్రారంభ దశలోనే వెంకీ కుడుముల వార్నర్‌ను సంప్రదించి, పాత్ర గురించి వివరించారని, వార్నర్ కూడా వెంటనే అంగీకరించారని నితిన్ వెల్లడించారు.

ముఖ్యంగా ద్వితీయార్థంలో అతని పాత్ర ఆసక్తికరంగా సాగుతుందని, సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని నితిన్ నమ్మకంగా చెప్పారు.ఇక సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల డైలాగులు, పాటలతో వీడియోలు చేసి అభిమానులను అలరించే అతను, ముఖ్యంగా అల్లు అర్జున్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్నాడు. అంతే కాకుండా, బన్నీ కూడా వార్నర్ క్రేజ్‌కు ఫిదా అవుతూ, అతని వీడియోలను ఆసక్తిగా చూస్తుంటాడు. వార్నర్‌కు ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకుని ‘రాబిన్ హుడ్’ చిత్ర బృందం అతనిని సినిమాలో భాగం చేసింది. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.