Bhagat Singh వీరి పేర్లు వింటేనే గుండె గర్వంతో నిండిపోతుందన్న మోదీ ,చంద్రబాబు

Bhagat Singh : వీరి పేర్లు వింటేనే గుండె గర్వంతో నిండిపోతుందన్న మోదీ ,చంద్రబాబు

Bhagat Singh : వీరి పేర్లు వింటేనే గుండె గర్వంతో నిండిపోతుందన్న మోదీ ,చంద్రబాబు భారత స్వాతంత్ర్య సమరంలో అపురూప Chapter గా నిలిచిపోయిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరచిపోలేదు. వీరు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఉరికంబం ఎక్కిన చారిత్రక సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరికి నివాళులు అర్పించారు. 23 ఏళ్ల చిన్న వయసులోనే వీరు ప్రాణత్యాగం చేసి యువతకు చిరస్మరణీయమైన స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి బాటలో మనం నడవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ కూడా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లకు శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisements
Bhagat Singh వీరి పేర్లు వింటేనే గుండె గర్వంతో నిండిపోతుందన్న మోదీ ,చంద్రబాబు
Bhagat Singh వీరి పేర్లు వింటేనే గుండె గర్వంతో నిండిపోతుందన్న మోదీ ,చంద్రబాబు

వీరి పేర్లు వినగానే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుందని ఆయన అన్నారు.బ్రిటీష్ పాలకుల అకృత్యాలను ఎదుర్కొంటూ భరతమాత కోసం వీరు పోరాడి అమరులయ్యారని మోదీ పేర్కొన్నారు. దేశం ఈ త్యాగమూర్తులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని ఆయన తెలిపారు.1931 మార్చి 23న బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లను ఉరి తీయించింది. బ్రిటీష్ అధికారి శాండర్స్ హత్యకేసులోనూ, అసెంబ్లీలో బాంబుల ఘటనలోనూ వీరిపై కేసులు పెట్టారు. వీరి ఉరిశిక్ష భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశ ప్రజలు ఈ రోజు వీరిని స్మరించి, దేశభక్తిని పునరుద్ధరించుకుంటారు.

Related Posts
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై కేజ్రీవాల్ కీలక నిర్ణయం: ఆప్ స్వతంత్ర పోటీకి సిద్ధం
Arvind Kejriwal 1 1

ఇండియా కూటమికి పెద్ద నిరాశ ఎదురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఒక కీలక నిర్ణయం Read more

Waqf Bill : వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Lok Sabha passes Waqf Amendment Bill

Waqf Bill: సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ‌ చర్చ జరిగింది. 12 గంటల Read more

Virat Kohli: చెన్నైపై విజ‌యం త‌ర్వాత డ్యాన్స్ వేసిన కోహ్లీ
Virat Kohli: చెన్నైపై విజయం తర్వాత డ్యాన్స్ వేసిన కోహ్లీ

శుక్రవారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చెన్నై సూపర్ Read more

Gujarat Titans: చేతులు మారనున్న గుజరాత్ టైటాన్స్
చేతులు మారనున్న గుజరాత్ టైటాన్స్

భారతదేశంలో క్రికెట్ లవర్స్ ఎక్కువ. ఈ క్రమంలోనే త్వరలో ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది. ఈ క్రమంలో టీమ్స్ యాజమాన్యాల మార్పులు కూడా జరుగుతున్నాయి. టొరెంట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×