జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు

Somu Veeraju : జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు

Somu Veeraju : జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు వైసీపీ అధినేత జగన్‌పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని జగన్ అనుకోవడం కేవలం కలగానే మిగిలిపోతుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.2014లో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా వచ్చినప్పటికీ అసెంబ్లీకి వెళ్లలేదని వీర్రాజు గుర్తు చేశారు.

Advertisements
జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు
Somu Veeraju జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు

ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని చెప్పడం జగన్ ద్వంద్వ ధోరణిని బయటపెడుతోందని విమర్శించారు.కూటమి లక్ష్యం వైసీపీని పూర్తిగా ఖాళీ చేయడమేనని స్పష్టం చేశారు.అంతేకాదు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా సోము వీర్రాజు మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని, తన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు భవిష్యత్తుపై గందరగోళంలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే మాటలు చెప్పి పదేళ్ల పాటు పాలన సాగించారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Related Posts
మహదేవ్‌ శాస్త్రిగా మోహన్‌ బాబు
mohan babu kannappa

కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం Read more

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజ‌శేఖ‌రం విజ‌యం
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజ‌శేఖ‌రం విజ‌యం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు.ఆయన పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై గెలుపొందారు. Read more

BC protest : జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న బీసీ సంఘాల ధర్నా
BC groups ongoing protest at Jantar Mantar

BC protest: దేశరాజధాని ఢిల్లీ జంతర్‌మంతర్‌ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల ధర్నా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలను Read more

Bhogapuram: భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Bhogapuram: భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌: అభివృద్ధి వైపు శరవేగం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ అయిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×