हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

TTD: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం!

Anusha
TTD: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం!

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అందుతోంది. వేసవి సెలవులు నేపథ్యం లో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో, టీటీడీ దర్శన వేళల్లో మార్పులు చేసింది. బ్రేక్ దర్శన సమయాలను నేటి నుంచి ప్రయోగాత్మకంగా మార్పు చేసి అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఏ కోటా దర్శనం ఎప్పుడో టీటీడీ స్పష్టత ఇచ్చింది. సామాన్య భక్తులకు మరో గంట దర్శన సమయం పెరిగింది.

బ్రేక్‌ దర్శనాలు

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల మార్పు ఈ రోజు (గురువారం) నుంచి అమల్లోకి రానుంది. గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉదయం 5.30 గంటలకు మొదలై ఉదయం 11 గంటలకు ముగిసేవి. అయితే రాత్రి వేళల్లో కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చారు. అయినప్పటికీ జనరల్‌ బ్రేక్‌ దర్శన భక్తులకు మాత్రం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలోపు దర్శనం చేయిస్తున్నారు. ఇక, రెండవ నైవేద్యం గంట అంటే ఉదయం 10 గంటల తర్వాత ప్రొటోకాల్‌, రెఫరల్‌, శ్రీవాణి, ఉద్యోగులకు దర్శనం చేయిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ బ్రేక్‌ దర్శనాలు నడుస్తున్నాయి.క్యూ లైన్లలో ఉన్న భక్తులకు మేలు చేసే విధంగా ధర్మకర్తల మండలి తిరిగి బ్రేక్‌ దర్శనాల్లో పూర్వపు విధానాన్ని అమలుచేయాలని తీర్మానించింది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి తిరిగి పాత పద్ధతిలో బ్రేక్‌ దర్శనాలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది. ప్రొటోకాల్‌, రిఫరెల్‌, జనరల్‌ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించి తిరిగి 10.15 గంటల నుంచి 11.30 గంటలలోపు శ్రీవాణి, టీటీడీ ప్రస్తుత, రిటైర్డ్‌ ఉద్యోగులకు దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళికలు అమలు చేస్తు న్నారు. ఇక సిఫారసు లేఖలపై బ్రేక్‌ దర్శనాలనూ నేటి నుంచి రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం లభించనుంది.

 TTD: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం

ఉద్యోగులను

టీటీడీ తీసుకున్న నిర్ణయం మేరకు ఉదయం 5.45: ప్రొటోకాల్‌ దర్శనం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ఉదయం 6.30: రిఫరెల్‌ ప్రొటోకాల్‌ కు అనుమతిస్తారు. ఇక, ఉదయం 6.45: జనరల్‌ బ్రేక్‌ దర్శనం మొదలు అవుతోంది. ఉదయం 10.15: శ్రీవాణి (ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌) దర్శనాలు ప్రారంభించనున్నారు. 10.30: దాతలు, ఆ తరువాత ఉదయం 11.00: టీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగులను దర్శనాలకు అనుమతిస్తారు. కాగా, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు బ్రేక్‌ దర్శనాలు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.

Read Also: Mohan Babu : మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిందే – సుప్రీంకోర్టు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870