పురావస్తుశాఖ అనుమతులకోసం టిటిడి నిరీక్షణ!
తిరుమల: ఏడుకొండలవాడా గోవిందా గోవింద అంటూ కాలినడకన శ్రీవారిమెట్టుమార్గంలో తిరుమలకు చేరుకునే భక్తుల సౌలభ్యం కోసం జారీచేస్తున్న దివ్యదర్శనం టోకెన్లు శ్రీనివాస మంగాపురం(Srinvasa Mangapuram)లో కౌంటర్లు ఏర్పాటు మరింత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆలయం ప్రాంగణంలో విశాలమైన స్థలం కూడా ఉంది. ఇప్పటికే ఇక్కడ టోకెన్ జారీ కౌంటర్లు(Counters) ఏర్పాటుచేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇఒ శ్యామలరావు(TTD EO Shaymalarao) పురావస్తుశాఖకు లేఖరాశారు. ఈ లేఖ చేరినా అనుమతులు రావడానికి మరికొంత ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఈ మార్గంలో రోజుకు 4వేలనుండి 5వేల దివ్యదర్శనం టోకెన్లు జారీచేస్తున్నారు. గతంలో శ్రీవారిమెట్టు మార్గంలోనే మొదట్లో టోకెన్లు అందుకున్న భక్తులు 1,200మెట్ల వద్ద స్కానింగ్ చేసుకుని, ముద్ర (స్టాంప్) వేసుకుని కొండకు చేరుకోవాల్సి ఉంది.

టోకెన్లుజారీని తిరుపతి అలిపిరి భూదేవికాంప్లెక్స్ వద్ద ఏర్పాటు
అయితే గతంలో శ్రీవారిమెట్టుమార్గంలో భక్తులను ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు మాయమాటలతో నమ్మించి అధికఛార్జీలతోబాటు ఉచిత టోకెన్లు(Free Tockens)కు డబ్బులు వసూలుచేసేవారని ఫిర్యాదులు రావడంతో మెట్లమార్గంలో కౌంటర్లు మూసివేశారు. తాత్కాలికంగా ఈ టోకెన్లుజారీని తిరుపతి అలిపిరి భూదేవికాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేశారు. అక్కడ నాలుగు కౌంటర్లలో రోజువారీగా మూడువేల నుండి ఐదువేల దివ్యదర్శనం టోకెన్లు జారీ అవుతున్నాయి. ఈ టోకెన్లు అందుకున్న భక్తులు శ్రీవారిమెట్టువరకు ఉచితంగా
ప్రయాణించేలా బస్సులు ఏర్పాటుచేశారు. అయినా చాలామంది భక్తులు శ్రీనివాస మంగాపురం నుండి తిరుపతి అలిపిరి వరకు వచ్చి నిరీక్షించి టోకెన్లు అందుకునేందుకు అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో శ్రీనివాసమంగాపురం ఆలయం వద్ద కౌంటర్లు ఏర్పాటుచేసి దివ్యదర్శనం టోకెన్లు జారీచేస్తే బావుంటుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు కర్నాటకరాష్ట్రం బెంగుళూరు, మైసూరు, తమిళనాడు వేలూరు,తిరు వణ్ణామలై, కుప్పం, చిత్తూరు. అనంతపురం, మదనపల్లి వైపునుండి వచ్చే యాత్రికులు శ్రీవారిమెట్టు మార్గంలోనే కాలినడకన తిరుమలకు వస్తుంటారు. ఇలా రోజువారీగా 10వేల మంది వరకు యాత్రికులు ఈ ప్రాంతాల నుండి చంద్రగిరి శ్రీనివాసమంగాపురం మీదుగా శ్రీవారిమెట్టుమార్గంలో తిరుమలకు చేరుకు నేందుకు చూస్తుంటారు. ఇప్పుడు ఇంతమంది యాత్రికులు అలిపిరికి చేరుకుని టోకెన్లు అందుకోవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేక శిబిరంలో రెండు కౌంటర్లు ఏర్పాటు
ఈ టోకెన్లుజారీ కౌంటర్లను త్వరగా శ్రీనివాసమంగాపురం ఆలయంలో ఏర్పాటుచేస్తే బావుంటుందని చెబుతున్నారు. టిటిడి ఆధ్వర్యంలోని శ్రీనివాసమంగాపురం కల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ స్వామివారికి రోజువారీగా జరిగే సేవలు, పూజలకు సంబంధించి దర్శన టిక్కెట్లు జారీ కౌంటర్లు ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక శిబిరంలో రెండు కౌంటర్లు ఏర్పాటు చేసిన టిటిడి భక్తులకు ఆయా సమయాల్లో సకాలంలో టిక్కెట్లు ఇస్తుంటారు. ఇక ఇప్పుడు కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీకి ప్రత్యేకంగా క్యూలైన్లతోబాటు ఆలయం ప్రాంగణంలోనే కౌంటర్లు ఏర్పాటు దిశగా చూస్తున్నారు. ఈ పనులు టిటిడి ఇప్పటికే చేపట్టినా పురావస్తుశాఖ నుండి అనుమతులు కోసం విజప్తి చేసింది. టోకెన్లు కౌంటర్లను వీలైనంత త్వరలోనే శ్రీనివాసమంగాపురం ఆలయానికి తరలించే అవకాశాలు ఉన్నాయి. పురావస్తుశాఖ అనుమతులు వస్తే వెంటనే టోకెన్లు జారీని టిటిడి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది. దీనివల్ల భక్తులు దోపిడీకి గురికావడం ఉండదు. దళారీలను నమ్మాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో జారీ అవుతున్న దివ్యదర్శనం టోకెన్లు కౌంటర్లను శ్రీనివాస మంగాపురం మార్పుచేసే వరకు అలిపిరిలోనే భక్తులు టోకెన్లు పొందాలని టిటిడి విజప్తి చేసింది.
Read Also: Nadendla Manohar: ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్