గ్రీన్‌లాండ్ అంశంపై చర్చించేందుకు జీ7 దేశాల అత్యవసర భేటీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Macron) పిలుపునివ్వగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. మెక్రాన్ ప్రతిపాదించిన సమావేశానికి వెళ్లనని తెలిపారు. ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత కారణంగా అధ్యక్షుడిగా మెక్రాన్ ఎక్కువ రోజుల ఉండరని వ్యాఖ్యానించారు. రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన వేళ శ్వేతసౌధంలో ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. నాటో కూటమిలోని దేశాలు అమెరికాతో అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ‘లేదు, నేను అలా చేయను. ఎందుకంటే ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఎక్కువ కాలం అక్కడ ఉండరు. ఆయనలో స్థిరత్వం లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమా? అనే విలేకర్లు ప్రశ్నించగా, మీకు తర్వలోనే తెలుస్తుందని సమాధానం ఇచ్చారు.
Read Also: Singapore: 15 లక్షల భరణం అడిగిన భార్యకు దిమ్మ తిరిగే జవాబిచ్చిన భర్త

‘సిరియా అంశంలో ఫ్రాన్స్-అమెరికా మధ్య ఏకాభిప్రాయం
ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో మెక్రాన్ పంపిన సందేశాలు పెట్టారు. అందులో ‘సిరియా అంశంలో ఫ్రాన్స్-అమెరికా మధ్య పూర్తి ఏకాభిప్రాయం ఉంది. అలాగే ఇరాన్ విషయంలో కూడా కలిసి గొప్ప పనులు చేయవచ్చని పేర్కొన్నారు. అయితే, గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వైఖరి మాత్రం తనకు అర్థం కావడం లేదు. దావోస్‌కు వచ్చిన ట్రంప్‌తో భేటీకి సిద్ధమని, జీ7 దేశాల నేతలను ఆహ్వానిస్తానని, వారితోపాటు ఉక్రెయిన్, డెన్మార్క్, సిరియా, రష్యా వారినీ పిలుస్తానని మెక్రాన్ తాజాగా తెలిపారు. గురువారం ట్రంప్‌ను విందుకు తీసుకెళ్తానని చెప్పారు’ అని మెక్రాన్ పెట్టిన సందేశంలో ఉంది. నాటోపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.’బతికున్నా, చనిపోయినా నాటో కోసం నేను చేసినంత పని ఎవ్వరూ చేయలేదు.
ఐరోపా కూటమికి మెక్రాన్ పిలుపు
అంతకుముందు దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్. అమెరికా వాణిజ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. సుంకాల ద్వారా ఐరోపాను అణగదొక్కే అమెరికా ప్రయత్నం అర్థం లేనిదని వ్యాఖ్యానించారు. ట్రంప్ గ్రీన్‌లాండ్ హెచ్చరికల నేపథ్యంలో ట్రేడ్ బజూకాకు (అమెరికా సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు) సిద్ధంకావాలని ఐరోపా కూటమికి పిలుపునిచ్చారు. ‘ఇది నిబంధనల్లేని ప్రపంచంలోకి వెళ్లడమే అవుతుంది. అంతర్జాతీయ చట్టం బలవంతుల పాదాల కింద నలిగిపోతోంది. సమిష్ఠి పాలన లేకుండా ప్రపంచ పోటీ నిరంతరంగా మారుతోంది. ట్రంప్ అంతులేని సుంకాలు మౌలికంగా ఆమోదయోగ్యం కాదు. దాని వల్ల ఐరోపా నెమ్మదిగా సాగవచ్చు అని మెక్రాన్ పేర్కొన్నారు.
Read Also: Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: