हिन्दी | Epaper

Davos: ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య.. మేరీలాండ్‌లో ల్యాండింగ్

Vanipushpa
Davos: ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య.. మేరీలాండ్‌లో ల్యాండింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్‌వన్ విమానంలో సాంకేతిక సమస్యతలెత్తింది. ఫలితంగాపైలట్లు విమానాన్ని మేరీలాండ్‌ లోని సైనిక స్థావరంలో ల్యాండ్చేశారు. ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2026లో పాల్గొనేందుకు విమానంలో బయలుదేరారు. అయితే, వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్ర్యూస్ నుంచి విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే పైలెట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు శ్వేతసౌధంప్రెస్ సెక్రటరీ కరోలిన్లివిట్ తెలిపారు.

Read Also: Sunita Williams: అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్

Davos: ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య.మేరీలాండ్‌లో ల్యాండింగ్
Davos: ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య.మేరీలాండ్‌లో ల్యాండింగ్

విమానంలో చిన్నస్థాయి ఎలక్ట్రికల్ సమస్య తలెత్తిందని, ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి జాయింట్ బేస్ ఆండ్ర్యూస్‌కు మళ్లించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై వైట్​ హౌస్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా స్పందించింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఫోర్స్ వన్ సిబ్బంది చిన్న ఎలక్ట్రికల్ సమస్యను గుర్తించారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానం తిరిగి బేస్‌కు తిరిగి చేరుకుంది. అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందం మరో విమానం ద్వారా స్విట్జర్లాండ్‌కు వెళ్తారు అని వైట్ హౌస్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ పేర్కొన్నారు.

ట్రంప్‌కు ఎలాంటి ప్రమాదం లేదు

డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2026లో పాల్గొనాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రపంచ నాయకులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు పాల్గొనే అత్యంత కీలకమైన అంతర్జాతీయ సదస్సు. ఈ సదస్సులో గ్లోబల్ ఎకానమీ, అంతర్జాతీయ వాణిజ్యం, భద్రత, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. వైట్ హౌస్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వెంటనే స్పందించి, ఇది అత్యవసర పరిస్థితి కాదని, కేవలం ముందస్తు జాగ్రత్త చర్య మాత్రమేనని స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘ప్రజాకేంద్రీకృత పాలనే మా విధానం’ – గవర్నర్ శివ ప్రతాప్‌ శుక్లా

‘ప్రజాకేంద్రీకృత పాలనే మా విధానం’ – గవర్నర్ శివ ప్రతాప్‌ శుక్లా

మళ్లీ పెరిగిన వంట నూనె ధరలు

మళ్లీ పెరిగిన వంట నూనె ధరలు

రంగనాథ్‌ను కోర్టుకు లాగుతా: కవిత

రంగనాథ్‌ను కోర్టుకు లాగుతా: కవిత

ఎగ్జామ్ హాల్‌లో గుండెపోటుతో చీఫ్ సూపరింటెండెంట్ మృతి!

ఎగ్జామ్ హాల్‌లో గుండెపోటుతో చీఫ్ సూపరింటెండెంట్ మృతి!

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

టెన్త్ విద్యార్థులకు నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్

టెన్త్ విద్యార్థులకు నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్

ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్కలు

వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్కలు

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

📢 For Advertisement Booking: 98481 12870