हिन्दी | Epaper

Naxalism: దేశంలో న‌క్స‌లిజం అంతం చేస్తాం: మంత్రి అమిత్ షా

Vanipushpa
Naxalism: దేశంలో న‌క్స‌లిజం అంతం చేస్తాం: మంత్రి అమిత్ షా

మార్చి 31 లోగా దేశం నుంచి న‌క్స‌లిజాన్ని(Naxalism) నిర్మూలించనున్న‌ట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 87వ సీఆర్పీఎఫ్ డే ప‌రేడ్‌లో ఆయ‌న పాల్గొన్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో సీఆర్పీఎఫ్ ద‌ళాలు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఆయన చెప్పారు. అక్క‌డ రాళ్లు రువ్వే ఘ‌ట‌న‌లు సున్నాకు ప‌డిపోయిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌ణిపూర్‌లోనూ వ‌ర్గ హింస‌ను ఆ ద‌ళాలు క‌ట్ట‌డి చేసిన‌ట్లు చెప్పారు. కేవ‌లం మూడేళ్ల‌లో మావోయిస్టుల వెన్ను విరిచిన‌ట్లు సీఆర్పీఎఫ్‌ను మంత్రి షా కీర్తించారు. సీఆర్పీఎఫ్‌పై న‌మ్మ‌కంతో కాన్ఫ‌డెంట్‌గా చెబుతున్నాన‌ని, దేశంలో 2026 మార్చి 31వ తేదీ వ‌ర‌కు న‌క్స‌ల్ స‌మ‌స్య‌ను నిర్మూలించ‌నున్న‌ట్లు షా తెలిపారు.

Read Also: Trump: సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

  Naxalism: We will end Naxalism in the country: Minister Amit Shah
Naxalism: We will end Naxalism in the country: Minister Amit Shah

చ‌త్తీస్‌ఘ‌డ్‌-తెలంగాణ బోర్డ‌ర్‌లో ఉన్న క‌ర్రెగుట్ట‌లో ఆప‌రేష‌న్ బ్లాక్ ఫారెస్ట్‌ను చేప‌ట్టిన ద‌ళాల‌పై మంత్రి షా ప్ర‌శంస‌లు కురిపించారు. ఆ ఆప‌రేష‌న్‌లో గ‌త ఏడాది ఏప్రిల్‌, మే మ‌ధ్య కాలంలో 31 మంది న‌క్స‌ల్స్ మ‌ర‌ణించారు. సుమారు 46 డిగ్రీల ఎండ‌లో ఆ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. న‌క్స‌ల్స్ ఆధీనంలో ఉన్న ఆ కొండ‌ల్ని విముక్తి చేసేందుకు కేంద్ర రిజ‌ర్వ్ పోలీసులు ద‌ళాలు అత్యంత ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు తెలిపారు. ప‌దేళ్ల క్రితం దేశంలో మూడు అతిపెద్ద హాట్‌స్పాట్ కేంద్రాలు ఉండేవ‌ని, జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదం, ఈశాన్యంలో చొర‌బాటులు, చ‌త్తీస్‌ఘ‌డ్ అడ‌వుల్లో న‌క్స‌లిజం పెద్ద స‌మ‌స్య‌గా ఉండేవ‌ని, కానీ ఇప్పుడు ఆ ప్రాంతాలు ప్ర‌గ‌తి, శాంతికి సంకేతంగా మారాయ‌న్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 700 మంది సీఆర్పీఎఫ్, న‌క్స‌ల్ ప్రాంతాల్లో 780 మంది, జ‌మ్మూక‌శ్మీర్‌లో 540 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

గాయం కారణంగా టోర్నీకి హర్షిత్ రాణా దూరం

గాయం కారణంగా టోర్నీకి హర్షిత్ రాణా దూరం

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

📢 For Advertisement Booking: 98481 12870