ఏఐ( కృత్రిమ మేధ) మానవ వికాసానికి అటంకంగా చూడరాదని, అవకాశంగా పరిగణించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. మానవ అభివృద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. ఏఐ(AI) సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని, ఏఐ వినియోగం చట్టబద్ధంగా, పునఃసమీక్షించేలా ఉండాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోన్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’ లో గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు. మేకిన్ ఇండియా, భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతోందని పేర్కొన్నారు.
Read Also: Bill Gates: చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో బిల్ గేట్స్ భేటీ

మనం ఏఐని శాసించాలి: మోదీ
ఏఐ కృత్రిమ మేధ మనల్ని కాదు.. మనం ఏఐని శాసించాలి అని మోదీ వివరించారు. మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం కావాలని, ఏఐ పరివర్తన శక్తిగా కొనసాగుతుందని.. దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుంది అని, దానిని సద్వినియోగం చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారాలు చూపుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఆరోవంతు జనాభా భారత్‌లోనే ఉంది అని, భారత కృత్రిమ మేధను, కొత్త సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఆసక్తి చూపుతుందని తెలిపారు. భారత్ ఏఐ పురోభివృద్ధిలో ఒక చరిత్రగా నిలుస్తుంది అన్నారు. మనుషులు, సాంకేతికత కలిసి అభివృద్ధి పయనం సాగించే శకంలో మనం ఉన్నామని, భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాదు.. ప్రస్తుతం కృత్రిమ మేధను ఉపయోగించి మనం ఏం చేయగలమనేదే అసలు ప్రశ్నగా చూడాలని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సే ఏఐకి మన బెంచ్ మార్క్‌లు అని ప్రధాని తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంలో ‘మానవ్‌విజన్’ ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విజన్ అర్థం, ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆయన వివరించారు. మానవ విజన్ లోని M – మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్: నైతిక విలువలు, బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ఏఐ వ్యవస్థలకు మార్గనిర్దేశం అని తెలిపారు. A – అకౌంటబుల్: పారదర్శక నిబంధనలతో, జవాబుదారీతనంతో ఏఐ వ్యవస్థలు పనిచేయాలని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: