పెడ్రో పాస్కల్ బెల్లా రామ్సే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ఫస్టు సీజన్ 2023లో స్ట్రీమింగ్ అయ్యింది. 9 ఎపిసోడ్స్ గా ఫస్టు సీజన్ ను అందించారు. ఇండియాలోను ఈ సిరీస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి సీజన్ 2 కోసం అంతా ఆసక్తితో వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ మొదలైంది. సీజన్ 2లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉండగా, ప్రతి సోమవారం ఒక ఎపిసోడ్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
కథ
ఫంగస్ సోకినా వాళ్లంతా జాంబీల తరహాలో వికృతంగా మారిపోయి .. మృగాల మాదిరిగా ఒకరిని ఒకరు పీక్కుని తింటూ ఉంటారు. వాళ్ల బారి నుంచి ‘సారా’ను తప్పించడానికి అతను చేసిన ప్రయత్నం ఫలించకుండా పోతుంది. ఫంగస్ కి విరుగుడు లేకపోవడంతో, అది సోకిన వారిని చంపడం కోసం ఆర్మీ ప్రయోగించిన బాంబులతో నగరాలన్నీ కూడా శిధిలమై పోతాయి. కూతురు చనిపోయిందనే బాధతోనే జోయెల్ 20 ఏళ్లు గడిపేస్తాడు.దాంతో ఫంగస్ బారి నుంచి తప్పించుకున్నవారి జీవితం దుర్భరంగా మారుతుంది. అయితే ఎలీ (బెల్లారామ్సే) అనే టీనేజ్ అమ్మాయికి ఫంగస్ సోకినా, ఆమెపై అది పెద్దగా ప్రమాదం చూపలేకపోతుంది. ఆమెలో ఆ ఫంగస్ ను ఎదుర్కునే ఇమ్యూనిటీ ఉంటుంది. దాంతో ఆమెను సేఫ్ గా ‘ల్యాబ్’కు తరలించే బాధ్యత జోయెల్ కి అప్పగించబడుతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసే ప్రయాణంగా ఫస్టు సీజన్ నడుస్తుంది.

విశ్లేషణ
భయంకరమైన ఫంగస్ ను తట్టుకుని జీవించగలిగే ఇమ్యూనిటీ తనకి ఉందని తెలియక ‘ఎలీ’ సాగించే ప్రయాణం ఫస్టు సీజన్ గా ప్రేక్షకులను పలకరిస్తుంది. తనకి ఫంగస్ సోకినా పెద్దగా ప్రమాదం ఉండదనే నిర్లక్ష్యంతో ‘ఎలీ’ ఉండటం వలన ఏం జరిగిందనేది సీజన్ 2 కథగా వచ్చింది. ఈ సారి ఆమె హీరో పర్యవేక్షణలో కాకుండా ఆయనకి దూరంగా ఉండటం, ఆడియన్స్ లో మరింత కుతూహలాన్ని పెంచే అంశంగా చెప్పుకోవాలి. సీజన్ 1కి ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అనవసరమైన సన్నివేశాలు సాగతీత సన్నివేశాలు లేకపోలేదు. ఫంగస్ కారణంగా నగరాలు శ్మశానాలుగా మారిపోయిన తీరును మాత్రం సహజత్వానికి చాలా దగ్గరగా చిత్రీకరించారు. హీరో ఎలీ కలిసి ప్రయాణించే పర్వత ప్రాంతాలకు సంబంధించిన లోకేషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. సీజన్ 2లోను లొకేషన్స్ మంచి మార్కులు కొట్టేస్తాయని అనిపిస్తోంది.
Read Also:Nag Ashwin: ఇన్సెప్షన్ సినిమా చూసి వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లాను : నాగ్ అశ్విన్