దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల కొందరు కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, సినీ పరిశ్రమలో తన ప్రయాణం, అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’, విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల విషయంలో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఆ సినిమాలకు తాను ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేదని అనిపించినట్లు పేర్కొన్నారు. అయితే, వేరే దర్శకుల సినిమాలను తాను డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేదని మాత్రం ఎప్పుడూ అనిపించలేదని స్పష్టం చేశారు,
బ్లాక్‌బస్టర్
దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నాగ్, తొలి చిత్రం ఎవడే సుబ్రమణ్యంతో ఘన విజయాన్ని అందుకున్నారు. నాని హీరోగా, విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయం అనంతరం, నాగ్ అశ్విన్ కీర్తి సురేష్‌తో మహానటి చిత్రాన్ని రూపొందించి సూపర్ హిట్ సాధించారు. ఈ చిత్రం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత, ప్రభాస్‌తో కల్కి 2898 ఏడి సినిమాను తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.ప్రస్తుతం కల్కి 2 సీక్వెల్ పనులు కొనసాగుతున్నప్పటికీ, ప్రభాస్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడునాగ్ అశ్విన్.

ప్రభావితం
2008లో తాను జ్ఞాపకాల అంశంతో ఒక కథ రాసుకున్నానని, రెండేళ్ల తర్వాత అదే కాన్సెప్ట్‌తో హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ఇన్సెప్షన్’ సినిమా ట్రైలర్ చూసి తాను నిరాశలోకి జారిపోయానని తెలిపారు.‘ఇన్సెప్షన్’ ట్రైలర్ చూసిన తర్వాత వారం రోజుల పాటు డిప్రెషన్‌లో ఉన్నాను. నా కథ జ్ఞాపకాల ఆధారంగా ఉంటే, ‘ఇన్సెప్షన్’ కలల అంశంతో రూపొందింది. ఈ రెండు కాన్సెప్ట్‌లు దాదాపు సమానంగా ఉండటం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆ సమయంలో నేను పూర్తిగా కుంగిపోయాను” అని నాగ్ అశ్విన్ వివరించారు. సినిమా విజయంలో ఎడిటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని, తాను కూడా గతంలో కొన్ని ప్రాజెక్టులకు ఎడిటర్‌గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తాను హాస్యాన్ని ఇష్టపడతానని, ముఖ్యంగా దివంగత దర్శకుడు జంధ్యాల సినిమాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు.తన దర్శకత్వ శైలి గురించి వివరిస్తూ, ముందుగా కథను సిద్ధం చేసుకున్నాకే అందులోని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంపిక చేసుకుంటానని నాగ్ అశ్విన్ వివరించారు. ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించానని, కథలోని పాత్రలను దృష్టిలో ఉంచుకుని మొదట అమితాబ్ బచ్చన్‌ను, ఆ తర్వాత ప్రభాస్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు.
Read Also: Nag Ashwin: ‘ఖలేజా’ ‘డియర్ కామ్రేడ్’ సినిమాల పై నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు