हिन्दी | Epaper

Central Government: జనాభా లెక్కింపులో కుల గణనను కూడా చేర్చాలని కేంద్రం నిర్ణయం

Anusha
Central Government: జనాభా లెక్కింపులో కుల గణనను కూడా చేర్చాలని కేంద్రం నిర్ణయం

సెంట్రల్ గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో చేయబోయే జనాభా లెక్కింపులో కుల గణనను కూడా చేర్చాలని ఢిల్లీలో బుధవారం రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీలో నిర్ణయించారు. ఈ విషయాన్ని నేరుగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. త్వరలోనే జనాభా లెక్కలు జరగబోతున్నాయని అందులోనే కుల గణనను కూడా చేర్చబోతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా కుల గణను పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని అందులో ఏమాత్రం పారదర్శకత లేదని పేర్కొంది. ఈరోజు కేంద్ర కాబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు.బుధవారం రోజు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీ భేటీ నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 2010లో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కుల గణన అంశాన్ని పరిశీలించాలని చెప్పారని గుర్తు చేశారు. ఈక్రమంలోనే నేటీ భేటీలో కుల గణనను జాతీయ జనాభా లెక్కల్లో చేర్చాలని నిర్ణయించినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ.. కుల గణనను వ్యతిరేకించాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అలాగే చాలా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కోణంలో కుల సర్వేలు చేశాయని విమర్శించారు.

వివరాలు

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్, దాని ఇండియా కూటమిలు కుల గణనను రాజకీయ సాధనంగా ఉపయోగించాయని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాలు కులాల జాబితాను బాగానే తయారు చేశాయని కానీ మరికొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాల వల్ల సరిగా చేయలేదని పేర్కొన్నారు. ఇలాంటి సర్వేల వల్ల ప్రజల్లో అనుమానాలు వస్తాయన్నారు. రాజకీయాల వల్ల సమాజంలో గందరగోళం ఏర్పడకుండా ఉండాలంటే సర్వేల బదులు జనాభా లెక్కల్లో కులాల వివరాలు సేకరించాలి అని మంత్రి అన్నారు.

పథకాలు

జనాభా లెక్కల్లో కులాల వివరాలు సేకరించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఏ కులంలో ఎంత మంది ఉన్నారో తెలుస్తుందన్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయన్నారు. కులాల మధ్య సమానత్వం కూడా వస్తుందని స్పష్టం చేశారు.

Read Also: Sundar Pichai: సుందర్ పిచాయ్ సక్సెస్ కు భార్య అంజలినే కారణమా!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాలుష్యం నుంచి స్వచ్చత వైపు మూసీ రివర్

కాలుష్యం నుంచి స్వచ్చత వైపు మూసీ రివర్

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

4,000 మంది ఉద్యోగులపై వేటు

4,000 మంది ఉద్యోగులపై వేటు

వంటగ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన

వంటగ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన

పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌పై ఈసీ వేటు- డీజీపీ బదిలీ

పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌పై ఈసీ వేటు- డీజీపీ బదిలీ

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

📢 For Advertisement Booking: 98481 12870