हिन्दी | Epaper

All-party meeting : ఉగ్రదాడి ఘటన…నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

sumalatha chinthakayala
All-party meeting : ఉగ్రదాడి ఘటన…నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

All-party meeting : జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనను స్వల్పంగా ముగించి ఢిల్లీకి తిరిగి వచ్చారు. బుధవారం సాయంత్రం మోడీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశం జరిగింది. ఇందులో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాకిస్థాన్‌తో సంబంధాలను తగ్గించడం, సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉగ్రదాడి ఘటన నేడు ఢిల్లీలో

భారత్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందనే అంశంపై చర్చ

ఈ క్రమంలోనే ఈ రోజు (గురువారం) సాయంత్రం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పహల్గామ్ దాడి తర్వాత కేంద్రం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. పాకిస్థాన్‌పై దౌత్యపరమైన, ఆర్థికపరమైన చర్యలతో పాటు, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందనే అంశంపై చర్చ జరగనుంది. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఎ-తొయిబాతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ఉందని ఆరోపణలు వచ్చాయి.

అత్యవసరమైతే జమ్ము లో రాష్ట్రపతి పాలన

కాగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో సీసీఎస్‌ (క్యాబినేట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేశారు. అటారి చెక్‌పోస్ట్‌ మూసివేత, పాకిస్తానీయులకు భారత్‌లోకి నో ఎంట్రీ ఆదేశాలు జారీ చేశారు. భారత్‌ నుంచి వెళ్లాలని పాక్‌ హైకమిషన్‌కు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాదు అత్యవసరమైతే జమ్ము లో రాష్ట్రపతి పాలన విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.

Read Also: పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870